
భాగ్యనగరంలో సెప్టెంబర్ 28న ”BLEEDING INDIA”తో పుస్తకం తో పాటు దాని తెలుగు అనువాదం “రక్త సిక్త భారతం” పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర మాజీ గవర్నర్ శ్రీ విద్యాసాగర్ రావు, భారతీయ మజ్దూర్ అఖిల భారత ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ బి సురెందరన్, ఆర్ ఎస్ ఎస్ అఖిల భారత సహప్రచార ప్రముఖ్ శ్రీ నరేంద్ర ఠాకూర్, ”Bleeding India” పుస్తక రచయిత బినయ్ కుమార్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పుస్తక రచయిత శ్రీ బినయ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ ”ఝార్ఖండ్ లో ఒక ముస్లిం యువకుడు హిందూ గిరిజన మహిళను వివాహమాడిన తరువాత కూడా మతం మార్చలేదు” అన్న వార్త ఆశ్చర్యం కలిగించిందనీ, ఆ విషయం పై పరిశోధన చేయగా బంగ్లాదేశ్ చోరబాటు దారులు దాదాపు పదివేల మంది ఇలా హిందూ గిరిజన స్త్రీ లను వివాహం పేరున లోబరుచుకొని పెద్ద ఎత్తున భూ ఆక్రమణలు జరిపారని ఈ పన్నాగం వెనుక PFI హస్తం ఉందనీ అర్ధం అయ్యిందని చెప్పారు. ఈ విషయం సామాన్యులకు అర్ధం కావలిసిన అవసరం గమనించి ఈ పుస్తకాన్ని రచించాననీ తెలిపారు.
సురేంద్రన్ గారు మాట్లాడుతూ ”దళిత” అనే పదాన్ని ‘దళిత వాయిస్’ అనే పేరు గల సంస్థ వ్యవస్థాపకుడు వి.టి రాజశేఖర్ అనే వ్యక్తి ప్రాచుర్యంలోకి తెచ్చారనీ, 1980 లలో షెడ్యూలు కులాలు అని కాకుండా దళిత అనే పదంతో దేశ విచ్చిన్నకర ఆలోచనలతో ఎలా హిందూ సమాజంలో అనైక్యత పెంచే ప్రయత్నం జరిగిందీ, ఇప్పుడు ఈ అనైక్యత వల్ల జరుగుతున్న అనర్ధాలను ప్రస్థావించారు.
ఈ పుస్తకాన్ని బర్కత్ పురా లోని కేశవ నిలయంలో పొందవచ్చు. ఆన్‌లైన్‌లో కింది లింక్ ద్వారా పుస్తకాన్ని కొనుగోలు చేయవచ్చు.
రక్తసిక్త భారతం : https://www.hindueshop.com/product/rakta-sikta-bhaaratam/
BLEEDING INDIA : https://www.hindueshop.com/product/bleeding-india/
More Stories
స్వదేశీ, స్వావలంబన దిశగా స్వదేశీ జాగరణ్ మంచ్
వరవరరావు బెయిల్ షరతుల మార్పుకు సుప్రీం నిరాకరణ
శ్రీశైలం ఘాట్ రోడ్లో ఎలివేటర్ కారిడార్ కు కేంద్రం సమ్మతి!