చరణ్‌జీత్‌ సింగ్ దళితుడా? క్రైస్తవుడా?

పంజాబ్‌ నూతన ముఖ్యమంత్రిగా చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ భన్వరీలాల్‌ పురోహిత్‌ ప్రమాణం చేయించారు. దీంతో పంజాబ్‌ తొలి దళిత ముఖ్యమంత్రిగా చన్నీ నిలిచారని కాంగ్రెస్ చెప్పుకొంటున్నది. 

అయితే ఆయన దళితుడు కాదని, మతం మారిన క్రైస్తవుడని సోషల్ మీడియాలో కధనాలు వైరల్ అవుతున్నాయి. పంజాబ్  లో పెద్ద ఎత్తున మతమార్పిడులు జరుపుతున్న రాకెట్  నడుపుతున్నాడని ఆరోపణలు చెలరేగుతున్నాయి. అతని భార్యకు గల ఎన్జీఓ అందులో ప్రసిద్ధి చెందింది.  ఈ విషయం సోనియాతో పాటు అందరికి తెలిసిన బహిరంగ రహస్యమే అని చెబుతున్నారు.

పైగా మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించడంతో ఆయనకు పేరున్నట్లు కూడా చెబుతున్నారు. ఇంతకు ముందు, తనను లైంగికంగా వేధించాడందుటూ  ఒక మహిళా ఐపీఎస్ ఫిర్యాదు చేయడంతో, అమరిందర్ సింగ్ చివాట్లు పెట్టిన తర్వాత ఆమెకు క్షమాపణలు చెప్పాడు. ఈ విషయమై #మీ టూ మహిళా ఉద్యమకారులెవ్వరు మాట్లాడక పోవడం విస్మయం కలిగిస్తుంది.

కాగా, రెండు రోజుల క్రితం సీఎం కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో అత్యంత నాటకీయ పరిణామాల మధ్య పంజాబ్‌ కొత్త సీఎంగా చన్నీని కాంగ్రెస్‌ పార్టీ ఎంపిక చేసింది. ఈనేపథ్యంలో ఆయన నేడు ప్రమాణం చేశారు. పంజాబ్‌లో మరో నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 

ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, ఎంపీ రాహుల్‌ గాంధీ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్దూ హాజరుకాగా,  మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ గైర్హాజరు అయ్యారు. కాంగ్రెస్ నేతలు సుఖ్ జిందర్ సింగ్ రంధ్వా, ఓపీ సోనీలు పంజాబ్ డిప్యూటీ సీఎంలుగా ప్రమాణం చేశారు. 

ఈ సందర్భంగా నూతన సీఎంకు రాహుల్‌ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. చన్నీ మాల్వా బెల్డ్‌లో రూప్‌నగర్‌ జిల్లాలోని చామ్‌కౌర్‌ సాహిబ్‌ అసెంబ్లీ స్థానం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన అమరీందర్‌ ప్రభుత్వంలో సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు.

అయితే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడానికి ముందు రోజు పంజాబ్‌లో వ‌చ్చే ఏడాది జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ న‌వ‌జోత్ సింగ్ సిద్ధూ నేతృత్వంలోనే కాంగ్రెస్ పోరాడుతుందని ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జి హ‌రీశ్‌రావ‌త్ ప్రకటించడం కాంగ్రెస్ వర్గాలలో అంతర్గత కుమ్ములాటలు వెల్లడి చేస్తుంది. 
సాధారణంగా ముఖ్యమంత్రి నేతృత్వంలో పోరాడతారు. పైగా, అత్యంత ప్ర‌జాద‌ర‌ణ పొందిన నాయ‌కుడిగా సిద్ధూకు పేరున్నది పేర్కొనడం ముఖ్యమంత్రిగా చరణ్‌జీత్‌ సింగ్‌  తాత్కాలిక ఏర్పాటు మాత్రమే అనే సంకేతం ఇచ్చిన్నట్లు అయింది.