మతబోధకుడి ముసుగులో అమ్మాయిలకు గాలం వేసి లోబర్చుకుంటున్న కీచక పాస్టర్‌ను హైదరాబాద్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఉప్పల్‌లోని గాస్పల్ చర్చికి పాస్టర్‌గా పనిచేస్తున్న జోసఫ్ అలియాస్ సాధు.. ప్రముఖ టీవీ ఛానల్లో మత ప్రబోధకుడుగా పని చేస్తూ అమాయక ఆడపిల్లలను టార్గెట్ చేశాడు.
మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా వారిపై లైంగిక దాడి చేసేవాడని ఆరోపణలు రావడంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికి జోసఫ్ ముగ్గురు అమ్మాయిలను మోసం చేసి, పెళ్లి చేసుకున్నాడు.
ఈ విషయం బయటపడటంతో పాస్టర్ ఆగడాల పై మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఎంఆర్పిఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. తమపై లైంగిక దాడి చేసి, బెదిరింపులకు దిగుతున్నాడని ముగ్గురు అమ్మాయిలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు పాస్టర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

More Stories
ఆత్మాభిమానం చంపుకొని కాంగ్రెస్‌లో కొనసాగలేను
23న బిజెపి తెలంగాణ అసెంబ్లీ ముట్టడి
తెలంగాణ బడ్జెట్ అత్యంత నిరాశాజనకం