
నాదీ కాలుష్యం పేరుతో గణేష్ ఉత్సవాలు, గణేష్ నిమజ్జనాలపై కొన్ని హిందూ వ్యతిరేక శక్తులు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు జి రాఘవరెడ్డి విమర్శించారు. ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శనివారం “సాగర పరిక్రమ” పేరుతో ట్యాంక్ బండ్ ( వినాయక సాగర్ ) చుట్టూ ద్విచక్ర వాహనాలతో బారీ ర్యాలీ నిర్వహించారు.
రాఘవరెడ్డి నేతృత్వంలో వందలాదిగా తరలి వచ్చిన గణేష్ భక్తులు దేశభక్తి- దైవభక్తి నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా రాఘవరెడ్డి మాట్లాడుతూ సెప్టెంబర్ 19న ట్యాంక్ బండ్ తో పాటు నగరం చుట్టూ ఉన్న చెఱువులలో ఘనంగా నిమజ్జనోత్సవాన్ని నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు.
గణేష్ ఉత్సవాల కారణంగా ఎలాంటి జల కాలుష్యం జరగడం లేదని ఆయన తేల్చి చెప్పారు. ఇటువంటి అపవాదులను కొట్టిపారవేయడం కోసం ప్రభుత్వం చెఱువుల కాలుష్యం, అన్యాక్రాంతం పై శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కార్యదర్శులు రావినూతల శశిధర్, కౌడి మహేందర్ , కేంద్ర కమిటి సభ్యులు ఆలె బాస్కర్, రూప్ రాజ్, జస్మత్ పటేల్ లతో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన వందలాది మంది పాల్గొన్నారు .
More Stories
వరవరరావు బెయిల్ షరతుల మార్పుకు సుప్రీం నిరాకరణ
శ్రీశైలం ఘాట్ రోడ్లో ఎలివేటర్ కారిడార్ కు కేంద్రం సమ్మతి!
సిబిఐకి ఫోన్ ట్యాపింగ్ కేసు?