
బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ పాదయాత్ర ఈ బెక 28కు వాయిదా పడింది. ఈ నెల 24వ తేదీ నుండి బండి సంజయ్ కుమార్ పాదయాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. ఉత్తరప్రదేశ్ మాజీ సిఎం కళ్యాణ్ సింగ్ మరణంలో పార్టీ కార్యక్రమాలను వాయిదా వేయాలని బిజెపి అధిష్టానం నిర్ణయం తీసుకొంది.
పార్టీ ఆధ్వర్యంలో మూడు రోజులు సంతాప దినాలు పాటిస్తున్నందున మంగళవారం(ఆగస్టు 24) నుంచి తాను చేపట్టాల్సిన పాదయాత్ర ఈ నెల 28న భాగ్య లక్ష్మి ఆలయం నుంచి ప్రారంభమవుతుందని సంజయ్ వెల్లడించారు.
ఈ నెల తొలి వారంలో ప్రారంభం కావాల్సిన పాదయాత్రను పార్లమెంట్ సమావేశాల కారణంగా వాయిదా వేశారు. ఈ నెల 9వ తేదీ నుండి ఈ యాత్రను ప్రారంభించాలని తొలుత నిర్ణయం తీసుకొన్నారు.
అయితే, పార్లమెంట్ సమావేశాల కారణంగా పార్టీకి చెందిన కీలక నేతలు ఈ పాదయాత్రలో పాల్గొనే అవకాశం లేకపోవడంతో యాత్రను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేశారు. దీంతో పార్టీ శ్రేణులు ఈనెల 24 నుండి యాత్ర నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి.
యూపీ మాజీ సిఎం కళ్యాణ్‌సింగ్ మరణించడంతో ఆయన మృతికి సంతాపంగా అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకోవాలని పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 24వ తేదీ వరకు పార్టీ కార్యక్రమాలు చేపట్టవద్దని సూచించింది.
కాగా, తెలంగాణలో 2023 ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చేంత వరకు జన ఆశీర్వాద యాత్ర కొనసాగుతుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. బండి సంజయ్ పాదయాత్ర ముగిసిన తర్వాత అన్ని జిల్లాల్లో ఆశీర్వాద యాత్ర నిర్వహిస్తామని చెప్పారు.
More Stories
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత
కాళేశ్వరం రూ. లక్ష కోట్ల అవినీతిపై సిబిఐ విచారించాలి