
ఈరోజు రక్షాబంధన్. ప్రభుత్వ చమురు సంస్థలు ఈరోజు సామాన్యులకు ఉపశమనం కలిగించాయి. ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు 20 పైసల మేరకు తగ్గింది. అదేవిధంగా డీజిల్ కూడా 20 పైసల మేరకు తగ్గింది. ఈ తగ్గింపు అనంతరం ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ. 101.64గా ఉంది. లీటరు డీజిల్ ధర రూ.89.07గా ఉంది.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్-డీజిల్ ధరలను ప్రకటిస్తుంటుంది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గాయి. వివిధ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి.
ముంబై- పెట్రోల్ రూ. 107.66, డీజిల్ రూ .96.64
చెన్నై- పెట్రోల్ రూ .99.32, డీజిల్ రూ. 93.66
కోల్‌కతా- పెట్రోల్ రూ. 101.93, డీజిల్ రూ. 92.13
జైపూర్- పెట్రోల్ రూ. 108.56, డీజిల్ లీటరుకు రూ. 98.22
భోపాల్- పెట్రోల్ రూ .110.06, డీజిల్ రూ. 97.88
కాగా, రక్షాబంధన్ సందర్భంగా ఢిల్లీ మెట్రో ప్రయాణీకుల సౌలభ్యం కోసం మెట్రో టైమింగ్‌లో మార్పులు చేసింది. ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా పింక్ లైన్‌పై మెట్రో సేవలు ఉదయం 6:30కే ప్రారంభం కానున్నాయి. రెడ్‌లైన్‌లో ఉదయం 5:30 నుంచే మెట్రో సేవలు మొదలుకానున్నాయి. మెట్రో ప్రయాణీకులు కోచ్‌లలోని అన్ని సీట్లలో కూర్చోవచ్చని మెట్రో అధికారులు తెలిపారు. అయితే ప్రయాణం సమయంలో మాస్క్ తప్పనిసరిగా ధరించాల్సివుంటుందని స్పష్టమ చేశారు.
హరియాణా ప్రభుత్వం రక్షాబంధన్ సందర్భంగా మహిళలకు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించింది. ముఖ్యమంత్రి మనోహల్ లాల్ ఖట్టర్ ఈ విషయాన్ని తెలిపారు. 15 ఏళ్లలోపు చిన్నారులు కూడా బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించారు. యూపీ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కూడా మహిళలు ఈరోజు ఉచితంగా బస్సుల్లో ప్రయాణించే అవకాశాన్ని కల్పించింది. ఇదేవిధంగా ఈరోజు వీకెండ్ లాక్‌డౌన్ సడలిస్తున్నట్లు యూపీ ప్రభుత్వం తెలిపింది.
More Stories
రైల్లో అమ్మే వాటర్ బాటిళ్ల ధర తగ్గింపు
జీఎస్టీ సంస్కరణలతో తగ్గనున్న ఆహార వస్తువుల ధరలు
భారీ సైబర్ దాడితో నిలిచిపోయిన పలు దేశాల విమానాశ్రయాలు