
ఉత్తర ప్రదేశ్ లో యోగి ఆదిత్యానాధ్ సారధ్యంలోని బీజేపీ ప్రభుత్వం పేర్ల మార్పు ప్రక్రియ కొనసాగిస్తోంది. అలీఘఢ్‌ను హరిఘఢ్‌గా, మొయినాబాద్ జిల్లాను మయన్ నగర్‌గా పాత పేర్లను పునరుద్ధరించాలని రెండు జిల్లా పంచాయతీలు తీర్మానాలను ఆమోదించి రాష్ట్ర ప్రభుత్వ ఆమోదానికి పంపాయి.
ఇటీవల జరిగిన జడ్‌పీ ఎన్నికల్లో బీజేపీ ఈ రెండు జడ్‌పీ పీఠాలను కైవసం చేసుకోవడంతో తొలి సమావేశంలోనే జిల్లాల పేర్లు మార్చుతూ తీర్మానాలను ఆమోదించాయి. బీజేపీ నేత భార్య విజయ్ సింగ్ అలీఘడ్ జడ్‌పీ చీఫ్‌గా ఎంపిక కావడంతో స్వామి హరిదాస్ పేరిట ఏర్పాటైన జిల్లాను హరిఘఢ్‌గా పునరుద్ధరించాలని తీర్మానాన్ని ప్రవేశపెట్టగా సభ్యులు ఆమోదించాయి.
ఇక మొయిన్‌పురి జిల్లా పేరును మయన్ రిషి పేరిట లోగడ వ్యవహరించగా అదే పేరును పునరుద్ధరించాలని జడ్‌పీ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ జిల్లా సమాజవాద్ పార్టీకి బలమైనది కావడంతో పాటు, ఆ పార్టీ వ్యవస్థాపక నేత ములాయంసింగ్ యాదవ్ ఇక్కడి నుండే లోక్ సభకు ఎన్నికయ్యారు.
More Stories
ఢిల్లీ, ముంబై హైకోర్టులకు బాంబు బెదిరింపులు
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు కసరత్తు