
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల ఆత్మహత్యల కట్టడికి ప్రభుత్వాలు శాస్త్రీయ చర్యలు తీసుకోకపోవడంపై జాతీయ మానవ హక్కుల కమీషన్ (ఎన్‌హెచ్‌ఆర్సీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ, తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యలపై నివేదిక ఇవ్వాలని, గతేడాది డిసెంబర్‌తో ఇరు రాష్ట్రాల సీఎస్‌లను ఎన్‌హెచ్‌ఆర్సీ ఆదేశించింది.
విద్యార్థుల ఆత్మహత్యల కట్టడికి రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న శాస్త్రీయ చర్యలు తెలపకపోవడంపై ఎన్‌హెచ్‌ఆర్సీ మండిపడింది. ఆరు వారాల్లోగా సమగ్ర నివేదిక అందించాలని ఇరు రాష్ట్రాల సీఎస్‌లకు ఎన్‌హెచ్‌ఆర్సీ ఆదేశించింది. నివేదిక అందించకపోతే తమ ముందు హాజరు కావాల్సి వస్తుందని సీఎస్‌లను హెచ్చరించింది.
తెలంగాణలో 2019 జాతీయ క్రైం రికార్డుల ప్రకారం 426 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఎన్‌హెచ్‌ఆర్సీ పేర్కొంది. ఏపీలో ప్రభుత్వ క్రైం రికార్డుల ఆధారంగా 383 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఎన్‌హెచ్‌ఆర్సీ తెలిపింది.
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై సుప్రీంకోర్టు న్యాయవాది శ్రావణ్ కుమార్ ఎన్‌హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రైవేటు విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అధికార యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవడం లేదని శ్రావణ్ కుమార్ ఫిర్యాదులో పేర్కొన్నారు.
More Stories
స్వదేశీ, స్వావలంబన దిశగా స్వదేశీ జాగరణ్ మంచ్
వరవరరావు బెయిల్ షరతుల మార్పుకు సుప్రీం నిరాకరణ
శ్రీశైలం ఘాట్ రోడ్లో ఎలివేటర్ కారిడార్ కు కేంద్రం సమ్మతి!