దేశ రాజధాని ఢిల్లీలో సంచలనం సృష్టించిన తొమ్మిదేండ్ల బాలిక హత్యాచార ఘటనకు సంబంధించి బాధితురాలి వివరాలు వెల్లడించినందుకు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ట్విటర్‌లపై జైపూర్ సెషన్స్ కోర్టులో బీజేపీ నేత జితేంద్ర గొత్వాల్ ఫిర్యాదు చేశారు.
నంగల్ గ్రామంలో బాధిత బాలిక కుటుంబ సభ్యులను రాహుల్ గాంధీ పరామర్శించిన సంగతి తెలిసిందే. ట్విటర్‌లో ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆయన పోస్ట్ చేశారు. చట్టప్రకారం లైంగిక దాడి బాధితురాలి వివరాలు వెల్లడించడం నేరంగా పరిగణిస్తారు.
బాలిక కుటుంబ సభ్యులతో ఫోటోలను పోస్ట్ చేసిన రాహుల్ గాంధీ, ట్విటర్‌లపై చర్యలు చేపట్టాలని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కూడా ఢిల్లీ పోలీసులను సంప్రదించింది. మరోవైపు బాలిక కుటుంబ సభ్యుల ఫోటోలను పోస్ట్ చేయడం బాధితురాలి వివరాలను బహిర్గతం చేసినట్టవుతుందని రాహుల్ పోస్ట్‌పై విమర్శలు వెల్లువెత్తాయి.

More Stories
మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం
20వ తేదీన బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక
అకల్ తఖ్త్ ముందు హాజరైన సీఎం మాన్