గ్రానైట్ అక్రమ రవాణపై మంత్రి గంగులకు ఈడీ కొరడా

కరీంనగర్  జిల్లాలో గ్రానైట్ అక్రమ రవాణపై ఈడీ కొరడా ఝులిపించింది. అనుమతులకు మించి గ్రానైట్ ను తరలిస్తున్నారని తొమ్మిది కంపెనీలకు నోటీసులు ఇచ్చింది. నోటీసులు అందుకున్న కంపెనీలలో మంత్రి గంగుల కమలాకర్ కు చెందిన శ్వేత ఏజెన్సీ కూడా ఉండడంతో రాజకీయంగా కలకలం రేపుతున్నది. 
 
 హుజురాబాద్ ఉప ఎన్నిక ముంగిట, క్షేత్ర స్థాయిలో మొత్తం ఎన్నికల ప్రచారాం తానే అన్నలంటూ వ్యవహరిస్తున్న మంత్రి గంగుల కమలాకర్‌‌కు ఊహించని షాక్ తగిలింది. ఫారిన్‌ ఎక్సే్ఛంజ్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ (ఫెవ) నిబంధనలు ఉల్లంఘించారంటూ కేంద్ర ప్రభుత్వానికి వరుసగా ఫిర్యాదులు వెళ్లడంతో ఈడీ దృష్టి సారింంది. 
 
ఫెమా నిబంధనలు ఉల్లంఘిం మోతాదుకు మించి విదేశాలకు ఎగుమతి చేస్తుండడంతోపాటు సీనరేజీ చార్జీలు ఎగవేతపై బండి సంజయ్‌ కేంద్రానికి 2019 జూలైలో ఫిర్యాదు చేశారు. తాజాగా ఈడీకి న్యాయవాదులు బేతి మహేందర్‌రెడ్డి, గంగాధర్‌ ఫిర్యాదు చేశారు. కరీంనగర్ పరిసరాలలో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన గ్రానైట్ నిక్షేపాలున్నాయి. విదేశాలకు ఏ మేరకు ఎగుమతి చేశారో చెప్పాలని ఈడీ నోటీసుల్లో పేర్కొంది. విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఏపీలోని కాకినాడ, కృష్ణపట్నం, చెన్నై, విశాఖ పోర్టులకు వెళ్లి అధికారులు పరిశీలన చేసినట్లు చెబుతున్నారు.
 
అయితే విదేశాలకు ఎగుమతి చేస్తున్న గ్రానైట్‌కు భారీ తేడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇందుకు సంబంధించి మే 29న ఉన్నతాధికారులకు ఓ నివేదిన ఇచ్చినట్లు సమాచారం. అదనంగా తరలించిన గ్రానైట్ కు సంబంధించి వారి నుండి జరిమానాతో సహా రూ 750 కోట్ల మేరకు వసూలు చేయాలనీ ఆ నివేదికలో సూచించినట్లు చెబుతున్నారు. 
 
బండి సంజయ్ ఫిర్యాదుపై స్పందిస్తూ తాను నిబంధనల ప్రకారమే గ్రానైట్ వ్యాపారం చేశానని, సిబిఐ కూడా తనకు క్లీన్ చిట్ ఇచ్చినది గంగుల మీడియాలో చెప్పడమే ప్రస్తుత ఉపద్రవానికి దారితీసిన్నట్లు గ్రానైట్ వ్యాపారాలు భావిస్తున్నారు. కరీంనగర్ గ్రానైట్ అక్రమాలపై ఈడీతో పాటు సీబీఐకి కూడా ఫిర్యాదులు వెళ్లినట్లు జిల్లాలో ప్రచారం జరుగుతోంది. నేడో రేపో సీబీఐ రంగంలోకి దిగే అవకాలునట్లు తెలుస్తోంది.