అశ్లీల సన్నివేశానికి అలాంటి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పెట్టడం ముమ్మాటికి తప్పేనని, తాను దాన్ని గమనించలేదని సినిమా దర్శకుడు యుగంధర్ ఆ వెంటనే విచారం వ్యక్తం చేశారు. సినిమా యూనిట్ తరఫును తాను క్షమాపణ కోరుతున్నానని యుగంధర్ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్టు చేశారు.
అంతకు ముందు, ‘ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు’ చిత్ర యూనిట్‌పై వనస్థలిపురం పోలీస్ స్టేషన్‌లో విశ్వహిందూ పరిషత్, బిజెపి ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. హిందువుల విశ్వాసాలను, మనోభావాలను గాయపరుస్తూ చిత్రం ట్రైలర్‌ను యూట్యూబ్‌లో విడుదల చేసిన చిత్ర దర్శకుడు, నిర్మాత, నటీనటులు తదితరులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
విహెచ్‌పీ రాష్ట్ర అధికార ప్రతినిధి రావినూతల శశిధర్, బీజేపీ మల్కాజిగిరి పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ పోచంపల్లి గిరిధర్ వేర్వేరుగా ఫిర్యాదులు చేశారు. ఈ విషయమై ఆందోళన ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.

More Stories
విజయోత్సవాలు జరుపుకొనేందుకు కాంగ్రెస్ సిగ్గుపడాలి
బిజెపి మహాధర్నా పోస్టర్ విడుదల
వైఫల్యాలు దాచిపెట్టేందుకే రేవంత్ `రైసింగ్ తెలంగాణ’ సదస్సు