ఆరోసారి పెండ్లికి సిద్ధమైన సమాజ్ వాదీ పార్టీ నేత, ఉత్తర ప్రదేశ్మా జీ మంత్రి చౌధరి బషీర్‌పై ఆయన భార్య నగ్మా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో యూపీ సర్కార్‌లో మంత్రిగా పనిచేసిన బషీర్‌కు నగ్మా మూడో భార్య కావడం విశేషం.
నగ్మా ఫిర్యాదుపై నిత్య పెండ్లికొడుకు, మాజీ మంత్రిపై ఆగ్రాలోని మంటోలా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశామని ఎస్పీ వెల్లడించారు. ముస్లిం మహిళా వివాహ చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేశారు.
షైష్ట అనే యువతితో బషీర్ ఆరోసారి పెండ్లికి సిద్దమయ్యాడని తనకు జులై 23న తెలిసిందని ఆమె వెల్లడించారు. బషీర్‌ను సంప్రదించగా తనను వేధించడమే కాకుండా ట్రిపుల్ తలాఖ్‌తో తనకు విడాకులు ఇచ్చి ఇంటి నుంచి గెంటేశాడని నగ్మా వాపోయారు.
బషీర్ మహిళలను వేధిస్తుంటాడని 2012లో తనకు ఆయనతో వివాహం జరగ్గా అప్పటి నుంచి శారీరకంగా, మానసికంగా చిత్ర హింసలకు గురిచేశాడని ఆమె ఆరోపించారు. మాజీ మంత్రిపై పలు ఆరోపణలతో కూడిన వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసిన ఆమె పోలీసులు తనకు సాయం చేయాలని కోరారు.

More Stories
పంజాబ్‌లో డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమకారుడు పర్వీందర్ సింగ్ జోటా కాల్చివేత
కాంగ్రెస్ ఎంపీ బిమోల్ అకోయిజామ్‌పై కఠిన చర్యలు
గర్భిణీ జర్నలిస్టును నెట్టి పారేసిన రాహుల్ గాంధీ?