ప్రపంచంలోని ముస్లిం శిల్పులంతా విశ్వకర్మ వారసులే అంటూ బీజేపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు రాంచందర్ జంగ్రా స్పష్టం చేశారు. చండీఘర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ దేశంలోని శిల్పుల ప్రస్తావన తీసుకొచ్చారు.
దేశంలోని శిల్పులంతా విశ్వకర్మ వారసులేనని ఆయన పేర్కొన్నారు. మొగల్ చక్రవర్తి బాబర్ భారతదేశానికి వచ్చినప్పుడు ఆయన వెంట శిల్పులను వెంటబెట్టుకునేమీ రాలేదని చెప్పుకొచ్చారు.
ఇరాక్, ఇరాన్, సౌదీ అరేబియా లాంటి దేశాల్లో ఎటుచూసినా ఇసుక దిబ్బలే కనిపిస్తాయని, అక్కడ శిల్పకళ అనేదే లేదని రాంచందర్ జంగ్రా చెప్పారు. కాబట్టి ప్రపంచంలోని ముస్లిం శిల్పులంతా విశ్వకర్మ వారసులే అని ఆయన తేల్చి చెప్పారు.

More Stories
బిజెపి కార్యనిర్వాహక అధ్యక్షునిగా నితిన్ నబిన్
శివరాజ్ సింగ్ చౌహాన్‌కు ఐఎస్ఐ నుంచి ముప్పు
కామ్రేడ్ల కంచుకోటలో కమల వికాసం