హిందువుల ఇళ్లనే కూల్చుతున్నారు.. పాతబస్తీ మాటేంటి?

హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాల్లో కూల్చివేతలపై తెలంగాణ బిజెపి ఎంపీలు మండిపడ్డారు. పన్నులు సక్రమంగా చెల్లిస్తున్న హిందువుల ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని గ్రేటర్ హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలపై బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపి అర్వింద్, సోయం బాబూరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఢిల్లీలో వారు మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ లో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకులు అభివ్రుద్దని కూడా మతం కోణంలో చూస్తున్నరని  ధ్వజమెత్తారు. మతం పేరుతో హిందువులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారని ధ్వజమెత్తారు.  అధికారంలో ఉన్న పార్టీలన్నీ మజ్లిస్ పార్టీకి కొమ్ముకాస్తున్నారని దుయ్యబట్టారు.

అప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు టీఆర్ఎస్ రెండూ ఎంఐఎం కు కొమ్ము కాసిన పార్టీలే. అధికార పార్టీ మోచేతి నీళ్లు తాగే పార్టీ ఎంఐంఎం. బిచ్చమెత్తుకునే పార్టీ అంటూ ఎద్దేవా చేసారు. కావాలనే హిందువుల ఆస్తులను ధ్వంసం చేయాలని చూస్తే పక్కా అడ్డుకుంటామని హెచ్చరించారు. పాతబస్తీలో రోడ్లు ఇరుకుగా ఉన్నాయి. ఎందుకు విస్తరించడం లేదని వారు ప్రశ్నించారు.

ఎంఐఎం అడ్డుకుంటే ఎందుకు ఆడుతున్నారు? పాతబస్తీలో కరెంట్ బిల్లు కట్టరు, ఇంటి పన్ను కట్టరు. పన్నులు కట్టే హిందువులున్న ప్రాంతాల్లో మాత్రం ఇల్లు కూల్చివేస్తున్నరు. పన్నులు కట్టడమే తప్పా? అంటూ నిలదీశారు. ఒకే పద్దతిలో అక్రమ కట్టడాలు కూల్చివేయాలే తప్ప ఒక వర్గానికి కొమ్ము కాస్తూ మెజారిటీ హిందువుల ఇళ్లు కూల్చేయాలనుకుంటే అడ్డుకుంటామని స్పష్టం చేశారు.

వరదల సందర్భంగా ప్రజలు తిరగబడ్డరు. ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ నాయకులే అక్రమించుకుంటున్నా వాటిపై చర్చలు తీసుకోకుండా పేద హిందువుల ఇళ్లను కూల్చేయడం సిగ్గు చేటని విమర్శించారు. చార్మినార్, ఖైరతాబాద్….. ఈ రెండు జోన్లు తప్ప మిగితా జోన్లను జీహెచ్ఎంసీ అధికారులు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అని ప్రశ్నించారు. దమ్ముంటే ముందు చార్మినార్, ఖైరతాబాద్ జోన్లలోని అన్ని అక్రమ నిర్మాణాలను కూల్చేసి మిగితా జోన్ల వద్దకు రండని సవాల్ చేశారు.

కాగా,  తెలంగాణలో వెనుకబడిన జోగులాంబ-గద్వాల్ జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు చేయాలని కోరుతూ బండి సంజయ్ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు లేఖ రాశారు. తెలంగాణలో అత్యంత వెనుకబడిన జిల్లా జోగులాంబ గద్వాల్ అని, ఈ జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు చేయాలని కోరుతూ పలువురు ప్రతిపాదించిన విషయాన్ని గుర్తు చేశారు.