జడ్జీల తప్పిదంతో మేరీకోమ్‌ ఓటమి?

టోక్యో ఒలింపిక్స్‌లో భారత దిగ్గజ బాక్సర్‌ మేరీకోమ్‌ (38) ఓటమికి జడ్జీల తప్పిదమే కారణమా ? కొలంబియాకు చెందిన ఇంగ్రిట్‌ వాలెన్షియాతో జరిగిన మహిళల ప్లె˜ౖవెయిట్‌ ప్రీ క్వార్టర్స్‌ ఫైనల్స్‌లో మేరీ కోమ్‌ ఓటమి పాలయ్యారు. మొదట తాను గెలిచానని ఆనందంలో చేయెత్తిన మేరీకోమ్‌కు… ప్రత్యర్థి విజేత అయ్యారని వినిపించడంతో కన్నీటిపర్యంతమయ్యారు. 

38 ఏళ్ల వయస్సులో భారత్‌కు పతకాన్ని తేవాలనే పోరాట పటిమతో ప్రత్యర్థిపై మేరీకోమ్‌ పిడిగుద్దులను కురిపించారు. కానీ ఇంతలోనే.. జడ్జీల అనూహ్య ప్రకటన ఆమెను విస్తుపోయేలా చేసింది ! వాలెన్షియాకు అనుకూలంగా ఐదుగురు జడ్జీలు 49 పాయింట్లు ఇవ్వగా, మేరీకోమ్‌కు మాత్రం 46 పాయింట్లు మాత్రమే కేటాయించారు.

అత్యంత ఆసక్తిగా జరిగిన ఈ బౌట్‌లోని మూడు రౌండ్లలో రెండింట మేరీ గెలిచినా చివరకు స్ల్పిట్‌ ఫలితంతో ఓడడం చర్చనీయాంశమైంది. హోరాహోరీగా సాగిన బౌట్‌లో ఇద్దరూ పంచ్‌లతో విరుచుకుపడిన తీరు అబ్బురపరిచింది. అయితే తొలి రౌండ్‌లో ప్రత్యర్థికి నలుగురు జడ్జిలు 10 పాయింట్లు ఇవ్వడంతో మేరీ 1-4తో వెనుకబడింది. 

చివరి రెండు రౌండ్లలో మాత్రం తన అపార అనుభవాన్ని ఉపయోగించుకుంటూ వలెన్సియాపై మేరీ పిడిగుద్దులను కురిపించింది. దీంతో ఈ రౌండ్లలో ఐదుగురు జడ్జిలలో ముగ్గురు మేరీకి పదేసి పాయింట్లు ఇచ్చారు. అటు వలెన్సియాకు ఇద్దరు జడ్జిలు మాత్రమే అనుకూలంగా ఉన్నారు.  కానీ విజేతను నిర్ణయించే ఓవరాల్‌ స్కోరు విషయంలో మేరీ కోమ్‌కు ఇద్దరు మాత్రమే అనుకూలంగా ఉండడంతో నిరాశే ఎదురైంది. చివరి రౌండ్‌ను 3-2తో కాకుండా 4-1తో గెలిస్తే కోమ్‌ క్వార్టర్స్‌కు చేరుకునేది. 

ఫలితంగా 4-1 తో వాలెన్షియా విజయం సాధించింది. ఓటమి భారంతో మేరీకోమ్‌ కన్నీళ్లు పెట్టుకున్నా కానీ ఓటమిని కూడా ఆమె చిరునవ్వుతో స్వాగతించారు.  జడ్జీల నిర్ణయం విస్మయ పరిచిందని కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు విస్మయం వ్యక్తం చేశారు. అనంతరం మేరీ కోమ్‌ మీడియాతో మాట్లాడుతూ అంతకుముందు వలెన్సియాతో తలపడిన రెండు సార్లూ మేరీ కోమ్‌ నెగ్గింది. అయితే జడ్జిలు పారదర్శకంగా వ్యవహరించలేదని మేరీ ఆరోపించింది. మ్యాచ్‌ ముగిశాక కూడా చాలాసేపు తానే గెలిచాననే భావనలో ఉన్నట్టు మేరీ తెలిపింది. 

రెండు రౌండ్లలో నెగ్గినప్పటికీ విజేతగా ఎందుకు ప్రకటించలేదంటూ ప్రశ్నించింది. జడ్జీల నిర్ణయం దురదృష్టకరమని పేర్కొన్నారు. జడ్జీల తప్పిదం వల్లే తాను ఓడిపోయానని ఆమె స్పష్టం చేశారు. పతకంతో తిరిగి వస్తానని అనుకున్నా.. కానీ తన తప్పు ఏమిటో అర్థం కాలేదని ఆవేదన చెందారు. ఇప్పటికీ ఈ విషయాన్ని నమ్మలేకపోతున్నానని కంటతడిపెట్టారు. 40 ఏళ్లు వచ్చే వరకు తాను ఆడతానని మేరీ కోమ్‌ స్పష్టం చేశారు.

మేరీ కోమ్ `రిపబ్లిక్ మీడియా నెట్‌వర్క్‌‘కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో న్యాయమూర్తులు ‘మోసం’ చేశారని, తన ప్రత్యర్థికి అనుకూలంగా ఉండే ‘అన్యాయమైన నిర్ణయం’ తీసుకున్నారని ఆరోపించారు. “గత 3-4 సంవత్సరాలుగా చేసిన నా ప్రయత్నం, నా పోరాటం, నా శ్రమ అంతా – ఇది సెకన్లలో పోయింది” అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 

కాగా,   తనకు అలాంటిది జరగడం ఇదే మొదటిసారి కాదని చెప్పారు. ఒలింపిక్స్ ఈవెంట్,  ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కూడా ఇలాంటిదే జరిగిందని ప్రముఖ బాక్సర్ వెల్లడించాడు. తొలిసారి ఒలింపిక్స్ క్రీడలలో జపాన్ లో మాత్రమే జడ్జీల నిర్ణయాన్ని సవాల్ చేసే అవకాశం క్రీడాకారులకు ఇవ్వలేదు. దానితో మేరీ ఆవేదన అరణ్య రోదనగా మిగిలిపోయింది.

ఒలింపిక్స్ నిర్వాహకులు తొలినుండి మేరీ పట్ల అసహనంగా వ్యవహరిస్తూ వచ్చారు. ఆట ప్రారంభమయ్యే సమయంలో ఆమె పేరు ప్రదర్శించే ఆమె షర్ట్ ను మార్చుకోవాలని స్పష్టం చేశారు. గతంలో ఎప్పుడు ఆ విధంగా జరగలేదు. 

కాగా, తనపై విశ్వాసం ఉంచిన భారతదేశ ప్రజలకు క్షమాపణలు చెబుతూ, మేరీ కోమ్ ఇలా అన్నారు: “నన్ను క్షమించండి, నేను చాలా బాధాకరమైన పతకంతో తిరిగి రాలేను.  ప్రతి ఒక్కరూ నా కోసం ప్రార్థిస్తున్నందుకు నేను సంతోషంగా ఉన్నాను.  సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో అన్ని సమయాలలో. మీ  ప్రేమ,  మద్దతు ఎల్లప్పుడూ నా హృదయంలో ఉంటాయి.  మీ కలలను నెరవేర్చడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. “

“మీ అందరి ప్రేమ, మద్దతు కోసం నేను సంతోషంగా, ఉన్నాను. నా కోసం కాకుండా రాబోయే రోజుల్లో ప్రదర్శన ఇవ్వబోతున్న వారి కోసం కూడా ప్రార్థిస్తూనే ఉంటాం. మళ్లీ భారతీయురాలిగా ఉన్నందుకు గర్వంగా ఫీల్ అవ్వాలని కోరుకుంటున్నాము”  అన్నారు ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్

. టోక్యో ఒలింపిక్స్ లో తన  అనుభవాన్నితెలిపుతూ  “ఈ ఒలింపిక్స్ చాలా అధ్వాన్నంగా ఉంది. లండన్ 2012లో  నా గత అనుభవాన్ని నేను వివరించగలను. అవును, మహమ్మారి కారణంగా నేను అర్థం చేసుకున్నాను అది సరిగా నిర్వహించబడకపోవచ్చు ఇతర సౌకర్యాలు సరిగా లేవు. బాక్సింగ్ అరేనా కూడా అస్సలు బాగోలేదు. ఇక్కడ చాలా విషయాలు జరుగుతున్నాయి. ప్రతిరోజూ పరీక్షలు జరుగుతున్నాయి, ప్రతిఒక్కరికీ ఇది భారీగా ఉంటుంది. మనం చాలా నియమాలు పాటించాలి.  లేకపోతే చర్య ఉంటుంది ఈ పోరాటం నా జీవితమంతా గుర్తుంచుకుంటాను. ”  అని మేరీ తెలిపారు.