అదానీ గ్రూప్ బ్రాండింగ్ ఆక్రమణల వెల్లడి

గత కొద్దీ ఏళ్లలో దేశంలో సంపన్నులలో అంబానీల తర్వాత స్థానం పొందిన అంబానీ గ్రూప్ పలు ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించడం క్రమంగా బైటపడుతున్నది. మారిషాస్‌ కేంద్రంగా ఒకే చిరునామా కలిగిన ఆరు హవాలా కంపెనీలు అదానీ గ్రూపులో వేల కోట్ల పెట్టుబడులపై సెబీ, డిఆర్ఐ లు ఒక వంక విచారణ జరుపుతూ ఉండగానే  కొత్తగా విమానాశ్రయాల్లో అదానీ కంపెనీల నిబంధనల అతిక్రమణల ప్రచార (బ్రాండింగ్‌) పద్దతులు నిరూపితమయ్యాయి.

ప్రతీ కమిటీలో అదానీ గ్రూపు ఎగ్జిక్యూటివ్‌, ఒక కేంద్ర ప్రభుత్వ ఆధినంలోని ఇంజనీరింగ్‌ ప్రాజెక్ట్స్‌ ఇండియా లిమిటెడ్‌ అధికారి, ఇద్దరు ఎఎఐ అధికారులతో వేరు వేరుగా మూడు కమిటీలను వేశారు. ఈ కమిటీలు అదానీ గ్రూపు బ్రాండింగ్‌ నిబంధనల ఉల్లంఘనలను గుర్తించాయి. విమానాశ్రయాల ప్రయివేటీకరణలో భాగంగా దేశ వ్యాప్తంగా సుమారు ఎనిమిది అంతర్జాతీయ, రీజినల్‌ ఎయిర్‌పోర్ట్‌లను అదానీ గ్రూపుకు కేంద్ర ప్రభుత్వం అప్పగించింది. 

ఈ సంస్థ నిర్వహిస్తోన్న అహ్మదాబాద్‌, మంగుళూరు, లక్నో విమానాశ్రయాల్లో రాయితీ ఒప్పందాలలో ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎఎఐ) సూచించిన లోగో బ్రాండింగ్‌ నిబంధనలను ఉల్లఘిస్తున్నట్లు తాజాగా ఎఎఐ ఏర్పాటు చేసిన మూడు కమిటీలు నిర్దారించాయి. ఆయా ఎయిర్‌పోర్ట్‌ల్లో బ్రాండింగ్‌, డిస్‌ప్లే బోర్డులను మారుస్తోన్నట్లు తెలుస్తోంది.

మూడు విమానాశ్రయాల నిర్వహణ కోసం 2019 ఫిబ్రవరిలో అదానీ గ్రూప్‌ బిడ్లను గెలుచుకుంది. ఎయిర్‌పోర్టుల నిర్వహణ కోసం ఫిబ్రవరి 2020లో ఎఎఐతో అదానీ గ్రూప్‌ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. నవంబర్‌ 2020 నుంచి ఎయిర్‌పోర్టుల నిర్వహణను అదానీ గ్రూప్స్‌ తీసుకున్నాయి. తాజాగా ఎఎఐ కమిటీలు నిర్వహించిన తనిఖీల్లో అదానీ గ్రూప్స్‌ ఆయా ఎయిర్‌పోర్టులో బ్రాండింగ్‌ నిబంధనలను కాలరాస్తున్నట్లు గుర్తించాయి. 

హోర్డింగ్‌లు, డిస్‌ప్లే విషయాల్లో ఎఎఐ సూచనలను అదానీ గ్రూప్స్‌ ఉల్లంఘించినట్లు గుర్తించాయి. అదే విధంగా ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ లోగోలను ప్రదర్శించడంలోనూ అదానీ గ్రూప్స్‌ నిబంధనలు పాటించలేదు. ఎఎఐతో ఒప్పందం సమయంలో చేసుకున్న నిబంధనలకు అనుగుణంగా డిస్‌ప్లే బోర్డులను వేస్తామని అదానీ గ్రూపు పేర్కొంది.