15 వచ్చిన ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేక పోతున్న జగన్ 

ఒక వంక ఆర్ధిక పరిస్థితులు కరోనా కారణంగా సహకరింపలేక పోతున్నా కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు బకాయిలతో సహా మూడు విడతల డిఎ లను పెంచగా, వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం 15వ తేదీ వచ్చినా ఈ నెలల్లో ఉద్యోగులు అందరికి జీతాలు చెల్లించక పోవడం ఆందోళన కలిగిస్తున్నది. 

పీఆర్సీ, డీఏల చెల్లింపులపై ప్రభుత్వంనుంచి స్పష్టమైన హామీ లభించక పోవడంతో ఉద్యోగ వర్గాలు కలవరం చెందుతున్నాయి. ముఖ్యమంత్రిని కలసి అవకాశమే లేకపోవడం, ఆర్ధిక మంత్రి అందుబాటులో లేకపోతు ఉండడంతో ఉద్యోగసంఘ నాయకులకు దిక్కు తోచడం లేదు.

జులై 1, 2018 నుంచి ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు డిఎ ల బకాయి ఉంది. వాటికి సంబంధించి జీవులను జారీ కావడంతో, చాలామంది ఉద్యోగులు సీఎఫ్ఎంఎస్ కింద బిల్లులు కూడా పెట్టుకున్నారు. 2018 పోయి 2021 వచ్చినా ఇంతవరకు ప్రభుత్వం మాత్రం డీఏలు విడుదలచేయడం లేదు. ప్రభుత్వం ఇచ్చిన జీవోలే అమలుకావడం లేదు. 

రాష్ట్ర ప్రభుత్వం నుంచి జిఓలు జారీ చేయించడం తమ ఘనతగా చెప్పుకొంటూ ఉద్యోగుల చేత సన్మానాలు చేయించుకున్న ఉద్యోగసంఘ నాయకులు ఇప్పుడు వారికి తమ ముఖం చూపించలేక ఇబ్బంది పడుతున్నారు. డిఏ అనేది ఉద్యో గుల హక్కని, ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్యన ఉన్న హక్కుని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని వారు స్పష్టం చేస్తున్నారు. 

కేంద్రప్రభుత్వం విడుదలచేసిన మూడు డీఏలు, ఏపీ ప్రభుత్వ మూడు డీఏలు కలిపితే, మొత్తం జగన్ సర్కారు ఉద్యోగులకు 6 డీఏలు బాకీ ఉన్నట్లు అవుతుంది. వీటితో పాటు పీఆర్సీ కూడా ఇవ్వాల్సిఉంది.  27శాతం ఐఆర్ ఇచ్చామని చెబుతున్నా అది కేవలం పనిచేస్తున్న ఉద్యోగులకు మాత్రమే వట్రహిస్తుంది. ఉద్యోగ విరమణ చేసిన వారికి ఎటువంటి ప్రయోజనం దక్కడం లేదు. గత ఏడాది జనవరి నుండి వేలాదిమంది రిటైర్ అయ్యారు. 

 రిటైరైన ఉద్యోగులకు వర్తించే బెనిఫిట్లు కూడా ప్రభుత్వం సరిగా అమలు చేయడంలేదని వారు వాపోతున్నారు. ఉద్యోగులు జీపీ ఎఫ్ అకౌంట్లలోని సొమ్ముతీసుకోవడానికి కూడా ఉద్యోగులకు వెసులుబాటు లేకుండా చేశారని ఆందోళన చేస్తున్నారు.