సౌర రంగంలో 3.5 బిలియన్‌ డాలర్ల కార్పొరేట్‌ నిధులు

సౌర రంగానికి ఈ ఏడాది మొదటి అర్థభాగంలో మొత్తం 13.5 బిలియన్‌ డాలర్ల కార్పొరేట్‌ నిధులు వచ్చాయి. గతేడాది ఇదే సమయంలో 4.6 బిలియన్‌ డాలర్ల నిధులను వచ్చాయని, ఒక్క ఏడాదిలో 193 శాతం పెరిగాయని తాజా నివేదిక పేర్కొంది. 

2021 క్యూ2లో సోలార్‌ ప్రాజెక్టు కార్యకలాపాల ద్వారా సేకరించిన మొత్తం రికార్డు స్థాయిలో ఉందని నివేదిక తెలిపింది. క్యూ1 2021లో 14.6 గిగావాట్లతో పోలిస్తే.. 24 గిగావాట్లకు పైగా సౌర ప్రాజెక్టులు కొనుగోలు చేయబడ్డాయని పేర్కొంది. ప్రాజెక్ట్‌ డెవలపర్లు, స్వతంత్ర విద్యుత్‌ ఉత్పత్తిదారులు, కొనుగోలుదారులు క్యూ2 2021లో 13.3 గిగావాట్లు తీసుకున్నారు. అనంతరం చమురు, గ్యాస్‌ కంపెనీలు 9 గిగావాట్ల సౌర ప్రాజెక్టులను కొనుగోలు చేసినట్లు మెర్కామ్‌ క్యాపిటల్‌ నివేదిక తెలిపింది.

గతేడాదితో పోలిస్తే 2021 మొదటి భాగంలో పెద్ద మొత్తంలో నిధులు సమకూరాయని, అయితే కరోనా మహమ్మారి తీవ్రంగా దెబ్బతీసిందని పేర్కొన్నారు.  కార్పొరేట్‌ విలీనం, ఎంఅండ్‌ఎ కార్యకలాపాలు గణనీయంగా పెరిగాయని, క్యూ2లో సౌర ప్రాజెక్టు సముపార్జన రికార్డు స్థాయికి చేరుకుందని మెర్కామ్‌ క్యాపిటల్‌ గ్రూప్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ రాజ్‌ ప్రభు తెలిపారు.

శిలాజ ఇంధనాలు, పునరుత్పాదకత, పర్యావరణ మార్పులు, సామాజిక, కార్పొరేట్‌ పాలన పెట్టుబడి పోకడలు, ఫైనాన్సింగ్‌తో పాటు ఎఅండ్‌ఎ కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపాయని చెప్పారు.

 1 హెచ్‌ 2021లో వెంచర్‌ క్యాపిటల్‌ ఫండింగ్‌ 680 శాతం అధికంగా ఉందని, 2020 మొదట అర్థభాగంలో 11 ఒప్పందాలతో 210 డాలర్లు సేకరించగా, ఇప్పుడు 26 ఒప్పందాలతో 1.6 బిలియన్‌ డాలర్లు సేకరించారని నివేదిక పేర్కొంది. 1హెచ్‌ 2020లో 25 లావాదేవీలు జరగగా, 1 హెచ్‌ 2021లో 54 లావాదేవీలు జరిగాయని వివరించారు.

 అలాగే క్యూ1 2021లో 20 లావాదేవీలతో పోలిస్తే.. క్యూ 2 2021లో 34 సోలార్‌ కార్పొరేట్‌ ఎంఅండ్‌ఎ లావాదేవీలు జరిగాయని, అయితే క్యూ2 2020లో కేవలం 13 లావాదేవీలు మాత్రమే జరిగాయని నివేదిక పేర్కొంది.