నవంబర్ 20 నుంచి అంతర్జాతీయ చలన చిత్రోత్సవం

భారతదేశ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఐఎఫ్ఎఫ్ఐ)52 వ ఎడిషన్‌ గోవాలో జరుగనున్నది. నవంబర్ 20 నుంచి 28 వరకు ఈ ఫెస్టివల్ ను నిర్వహించనున్నారు. ఐఎఫ్ఎఫ్ఐ కు సంబంధించిన పోస్టర్‌ను సమాచార,ప్రసారశాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ విడుదల చేశారు.

ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ) ఆసియాలోని కాకుండా భారతదేశంలోనే అతిపెద్ద అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ఒకటి. జనవరి 2021 లో 51 వ ఎడిషన్ విజయవంతం కావడాన్ని పరిగణనలోకి తీసుకుని ఐఎఫ్ఎఫ్ఐ 52 వ ఎడిషన్ హైబ్రిడ్ ఆకృతిలో జరుగుతుంది. 

ఈ వేడుకను భారత ప్రభుత్వ సమాచార,ప్రసార మంత్రిత్వ శాఖకు సంబంధించిన డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ (డిఎఫ్ఎఫ్) గోవా రాష్ట్ర ప్రభుత్వం,భారతీయ చలన చిత్ర పరిశ్రమ సహకారంతో నిర్వహిస్తోంది.

ఐఎఫ్ఎఫ్ఐని ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్స్ (ఎఫ్‌ఐఎపిఎఫ్‌) గుర్తించింది. ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం కొన్ని ఉత్తమమైన సినిమా రచనలను గుర్తిస్తుంది.

 అలాగే భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉత్తమ చిత్రాలను ప్రదర్శిస్తుంది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 52వ ఎడిషన్ పోటీ విభాగంలో పాల్గొనడానికి ఎంట్రీలను ఆగస్టు 31వరకూ సమర్పించవచ్చు.