కేరళలో మరోసారి కరోనా విజృంభిస్తున్నది. గత కొన్ని రోజులుగా రోజువారీ పాజిటివ్ కేసుల నమోదు పది వేలు దాటింది. ఈ నేపథ్యంలో కర్ణాటకలోని సీఎం యెడియురప్ప ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఆర్టీ-పీసీఆర్ నెగిటివ్ రిపోర్ట్ లేదా రెండు డోసుల కరోనా టీకా ధ్రువీకరణ పత్రాన్ని తప్పని సరి చేసింది.
కేరళ నుంచి కర్ణాటకకు విమానాలు, బస్సులు, రైళ్లు, ట్యాక్సీలు, వ్యక్తిగత వాహనాల్లో వచ్చేవారు ఈ పత్రాలను సమర్పించాల్సి ఉంటుందని తెలిపింది. ఆర్టీ-పీసీఆర్ నెగిటివ్ రిపోర్ట్ 72 గంటలకు మించకూడదని పేర్కొంది. అత్యవసర పరిస్థితుల్లో వచ్చిన వారికి కరోనా పరీక్ష నిర్వహించి ఆ మేరకు చర్యలు తీసుకుంటామని చెప్పింది.
అలాగే విద్య, వ్యాపారం, ఇతర పనుల కోసం కర్ణాటకకు వచ్చిన వారు ప్రతి 15 రోజులకు ఆర్టీ-పీసీఆర్ పరీక్ష చేయించుకుని నెగిటివ్ రిపోర్టును సమర్పించాలని తెలిపింది. కరోనా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై సంబంధిత చట్టాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కర్ణాటక ప్రభుత్వం ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మహారాష్ట్ర నుంచి వచ్చే వారికి కూడా జూన్ 29న ఇలాంటి నిబంధనలను వర్తింప చేసింది.

More Stories
బీహార్ ఉప ముఖ్యమంత్రి సిన్హా కాన్వాయ్‌పై రాళ్లదాడి
బెంగులూరులో 8,9 తేదీల్లో భగవత్ శతాబ్ది ప్రసంగాలు
భారత మహిళా క్రికెటర్లను అభినందించిన ప్రధాని మోదీ