ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శామ్‌సంగ్ చైనాకు భారీ షాక్ ఇచ్చింది. చైనాలో నిర్మించ తలపెట్టిన డిస్ ప్లే తయారీ యూనిట్ను ఉత్తరప్రదేశ్ లోని నోయిడాకు తరలిస్తున్నట్లు కంపెనీలో ఒక ప్రకటనలో తెలిపింది. శామ్‌సంగ్ సంస్థ నైరుతి ఆసియా అధ్యక్షుడు, సీఈఓ కెన్ కాంగ్ నేతృత్వంలోని శామ్‌సంగ్ ప్రతినిధి బృందం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను కలిసింది.
మెరుగైన పారిశ్రామిక వాతావరణం, పెట్టుబడిదారుల-స్నేహపూర్వక విధానాల కారణంగా.. చైనాలో ఉన్న డిస్ ప్లే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ను నోయిడాలో ఏర్పాటు చేయాలని శామ్ సంగ్ నిర్ణయించినట్లు ఆ సంస్థ ప్రతినిధి బృందం తెలిపింది. ఈ నిర్మాణ పనుల వల్ల భారతదేశం పట్ల తమ నిబద్ధతను తెలియజేస్తుందని పేర్కొన్నది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచ తయారీ కేంద్రంగా మార్చాలని ప్రతినిధి బృందం పేర్కొంది. ప్రతినిధి బృందంతో సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. శామ్‌సంగ్ నోయిడాలో నిర్మించనున్న కర్మాగారం ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం విజయానికి ఒక ఉత్తమ ఉదాహరణ అని పేర్కొన్నారు.
దీని వల్ల రాష్ట్రంలో ఉపాధి పొందడానికి రాష్ట్ర యువతకు సహకరిస్తుంది అని తెలిపారు. భవిష్యత్తులో కూడా రాష్ట్ర ప్రభుత్వం శామ్‌సంగ్ సంస్థకు సహాయం కొనసాగిస్తుందని ఆదిత్యనాథ్ ప్రతినిధి బృందానికి హామీ ఇచ్చారు.
More Stories
చైనా సీసీటీవీ కెమెరాలు, ఇతర నిఘా పరికరాలపై ఆంక్షలు!
14 వరద బాధిత రాష్ట్రాలకు రూ. 5858 కోట్లు విడుదల
టాటా గ్రూప్‌లోని రెండు ఎయిర్‌లైన్స్ విలీనం