
బీజేపీలో తనకు కొత్త కాదని ..అంతా పాత పరిచయాలేనని మాజీ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఉద్యమ సమయం నుంచి బీజేపీ నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సుష్మాస్వరాజ్ తో కలిసి అనేక వేదికలను పంచుకున్నామని, జేఏసీలో బండారు దత్తాత్రేయ లాంటి వాళ్ళ పెద్దలతో కలిసి పనిచేమని గుర్తు చేశారు.
హుజురాబాద్‌లో జరిగిన బీజేపీ పదాధికారుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాలు గొప్పవని చెప్పుకునే పరిస్థితి మాత్రమే ఉందని.. ప్రజలు హక్కుదారులు కాదు.. బిచ్చగాళ్లుగా మారే పరిస్థితి వచ్చిందని ధ్వజమెత్తారు.
గత రెండు నెలల్లో.. జరిగిన పరిణామాలు కారణం కాదని అనేక సందర్భాలలో ప్రజల సమస్యలపై తాను ప్రస్తావిస్తూ వచ్చానని తెలిపారు. అది వాళ్ళకి నచ్చలేదన్నారు. ఏ పార్టీకైనా కార్యకర్తలే మూలస్థంభాలని ఈటెల స్పష్టం చేశారు. కార్యకర్తలు పని చేస్తేనే సర్పంచ్ నుంచి ఎంపీ వరకు విజయాలు సాధిస్తారని పేర్కొన్నారు.
ఆత్మగౌరవం ప్రాతిపదికన తెలంగాణ ఏర్పడిందని, ఇక్కడి ప్రజలకు ఆత్మగౌరవం ఎక్కువని రాజేందర్ తెలిపారు. ప్రభుత్వం, ప్రతిపక్షం కలిసి పని చేస్తేనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని చెప్పారు. కానీ తెలంగాణలో ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని విచారం వ్యక్తం చేశారు. హుజురాబాద్ ప్రజలకు పార్టీ జండాతో సంబంధం లేదని, ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు ఇక్కడి ప్రజలు స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నారని తెలిపారు.
“మీరు పెట్టిన ఫ్లెక్సీల్లో చెబుతున్న పథకాల వెనుక నేను కూడా సూత్రధారి అనే విషయం మర్చిపోవద్దు” అని కేసీఆర్ ప్రభుత్వానికి గుర్తు చేస్తూ అధికారులు చట్టానికి లోబడి పని చేయాలని ఈటెల హితవు చెప్పారు. బీజేపీకి మద్దతు ఇచ్చే వారి ఇంటికి వెళ్లి కొంత మంది అధికారులు వేధించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
తాము ఎవరి జోలికి పోమని, అయితే తమ హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తే మాత్రం ఊరుకోబోమని రాజేందర్ హెచ్చరించారు. టీఆర్ఎస్ అధికారాన్ని, డబ్బులను, అణచివేతను నమ్ముకున్నారని, అయితే తాను మాత్రం కాషాయ జెండాను మాత్రమే నమ్ముకున్నానని
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో అభివృద్ధి నిధులు, సంక్షేమ పథకాలన్నీ కేంద్ర ప్రభుత్వానివేనన్నారు. కోవిడ్ సమయంలో రాష్ట్రంలో ఖర్చు చేసిన ప్రతి పైసా కేంద్రం ఇచ్చినవేనన్నారు. సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ వాటా లేకుండా ఎన్ని నిధులు కేటాయించారో, కేంద్ర వాటా లేని సంక్షేమ పథకాలు ఎన్ని అమలు చేస్తున్నారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ‘‘నమ్ముకున్న సిద్ధాంతం కోసం పని చేసే పార్టీ బీజేపీ. తెలంగాణ అధికారం చేపట్టే దిశగా ముందుకు వెళ్తున్నాం. మాట తప్పిన సీఎంను అడ్రస్ లేకుండా చేయాలి. తెలంగాణలో మార్పు కోసం, ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం మలిదశ ఉద్యమానికి బీజేపీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని బండి సంజయ్ తెలిపారు.
More Stories
స్వదేశీ, స్వావలంబన దిశగా స్వదేశీ జాగరణ్ మంచ్
వరవరరావు బెయిల్ షరతుల మార్పుకు సుప్రీం నిరాకరణ
శ్రీశైలం ఘాట్ రోడ్లో ఎలివేటర్ కారిడార్ కు కేంద్రం సమ్మతి!