ధూళిపాళ నరేంద్రపై ఇప్పుడు ఈడీ దృష్టి!

సంగం డైరీలో చైర్మన్ గా భారీకుంభకోణంకు పాలపడిన్నట్లు ఆరోపిస్తూ ఎసిబి కేసు నమోదు చేసి, అరెస్ట్ చేయడంతో జైలుకు వెళ్లి బెయిల్ పై విడుదలై బైటకు వచ్చిన సీనియర్ టిడి నేత, మాజీ ఎమ్యెల్యే ధూళిపాళ నరేంద్రకుమార్ పై వచ్చిన ఆరోపణలను ఇప్పడు  ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దృష్టి సారించిన్నట్లు తెలుస్తున్నది.

నిబంధనలను ఉల్లంఘిస్తూ డెయిరీ ఆస్తులను ధూళిపాళ్ల తమ కుటుంబ ట్రస్టుకు బదిలీ చేసి భారీ అక్రమాలకు పాల్పడినట్టు ఎసిబి నమోదు చేసిన ఆరోపణలను ఇప్పుడు ఎసిబి పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. కుటుంభం ట్రస్ట్ కు వచ్చిన నిధులను దారిమళ్లించిన్నట్లు వచ్చిన ఆరోపణలను సహితం దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తున్నది. 

ఈ సందర్భంగా ఈ క్రింది ఆరోపణలపై ప్రధానంగా దృష్టి సారించినట్లు చెబుతున్నారు: 

► సంగం డెయిరీకి ప్రభుత్వం ఇచ్చిన భూముల్లో 10 ఎకరాలను ధూళిపాళ్ల తన తండ్రి పేరిట ఏర్పాటు చేసిన ట్రస్ట్‌కు బదిలీ చేశారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ఇలా బదిలీ చేయడం సహకార చట్టంలోని 439 నిబంధనకు విరుద్ధమని ఈడీ గుర్తించింది. ఆ భూముల్లో తమ కుటుంబ ట్రస్ట్‌ పేరిట ఓ కార్పొరేట్‌ ఆస్పత్రి, రీసెర్చ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయడం నిబంధనలకు విరుద్ధమని చెబుతున్నారు. ధూళిపాళ్ల భార్య జ్యోతిర్మయి ఆ ఆస్పత్రికి ఎండీగా ఉన్న విషయం గమనార్హం.
► సహకార సొసైటీని కంపెనీగా మార్చాలంటే ముందు ప్రభుత్వానికి బకాయిలు చెల్లించడంతోపాటు ప్రభుత్వ భూములను వెనక్కి ఇచ్చేసి నిరభ్యంతర పత్రం పొందాలి. ఈ నిబంధనలను కూడా ధూళిపాళ్ల పట్టించుకోలేదనే అభియాగం ఉంది.
► ఫోర్జరీ పత్రాలతో ధూళిపాళ్ల జాతీయ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డు (ఎన్‌డీడీబీ) నుంచి రూ.115.58 కోట్లు రుణం తీసుకున్నారు. ఆ నిధులను తమ కుటుంబ ట్రస్ట్‌కు బదిలీ చేసినట్టు ఆరోపిస్తున్నారు.
► సంగం డెయిరీ నిధులతో కొనుగోలు చేసిన 72.54 ఎకరాలను ధూళిపాళ్ల హస్తగతం చేసుకున్నారనే ఆరోపణలపై ఈడీ కూపీ లాగుతున్నట్లు తెలుస్తున్నది.
► సంగం డెయిరీ చైర్మన్‌గా ఉంటూనే సహకార చట్టాలకు విరుద్ధంగా ధూళిపాళ్ల సొంతంగా మిల్క్‌లైన్‌ అనే డెయిరీని నెలకొల్పడం, అనంతరం దానికి తన భార్య జ్యోతిర్మయిని ఎండీని చేయడంపై కూడా దృష్టి సారించింది.
► తాజాగా డెయిరీ నిధులు రూ.50 కోట్లను ధూళిపాళ్ల తమ సొంత ట్రస్ట్‌కు బదిలీ చేసిన విషయాన్నీ ఈడీ గుర్తించింది. నిబంధనలకు విరుద్ధంగా మనీలాండరింగ్‌ పాల్పడి అక్రమాలకు పాల్పడ్డరన్న ఆరోపణలపై ద్రుష్టి సారిస్తున్నారు.