శశిథరూర్ ను ఎంపీగా అనర్హుడిగా ప్రకటించండి!

కాంగ్రెస్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి శశి థరూర్ ను లోక్ సభ సభ్యత్వం నుండి అనర్హునిగా ప్రకటించడానికి తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ స్పీకర్ ఓం బిర్లాకు బిజెపి ఎంపీ నిషికాంత్ దూబే లేఖ వ్రాసారు. 

 పార్లమెంటరీ ప్యానెల్ ఛైర్మన్ పదవిని సమాచార, సాంకేతిక పరిజ్ఞానంపై కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఉపయోగిస్తున్నారని దూబే ఆరోపించారు. “టూల్కిట్” సమస్యపై కేంద్ర ప్రభుత్వంపై థరూర్ ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యల పట్ల ప్యానెల్ సభ్యుడైన బిజెపి ఎంపి  దూబే బిర్లాకు రాసిన లేఖలో తీవ్ర అభ్యంతరం ప్రకటించారు.

పార్లమెంటరీ కమిటీ చైర్ పర్సన్ప దవిలో ఉన్న వ్యక్తి నుండి కాంగ్రెస్ నాయకుడు మర్యాద యొక్క అన్ని సరిహద్దులను అధిగమించారని దుబే  విమర్శించారు. అందువల్ల, “శశి థరూర్ ను లోక్ సభ సభ్యత్వం నుండి అనర్హులుగా ప్రకటింతగు చేందుకు చర్య తీసుకోవడాన్ని దయతో పరిశీలించాలని నేను కోరుతున్నాను” అని ఆయన తన లేఖలో కోరారు.

పార్లమెంటరీ కమిటీ పరిధికి వెలుపల ఉన్న సమస్యలను లేవనెత్తడం ద్వారా కేంద్ర ప్రభుత్వంతో పాటు పార్లమెంటును కూడా దెబ్బతీసేందుకు తన అధికారిక స్థానాన్ని శశిథరూర్  “దుర్వినియోగం” చేస్తున్నారని బిజెపి ఎంపి ఆరోపించారు. ముందుగా ఆ కమిటీ చైర్ పర్సన్ గా ఆయనను తొలగించాలని దూబే  డిమాండ్ చేశారు.