
చైనా మారుమూల ద్వీపాలను ఆక్రమించకుండా నిరోధించడానికి జపాన్ ఆత్మరక్షణ దళాలు ఆదివారం సైనిక విన్యాసాలు నిర్వహించాయి. షిజుకాలోని తూర్పు ఫుజి శిక్షణా ప్రాంతంలో జపాన్ ఈ వ్యాయామం చేపట్టింది.
తూర్పు చైనా సముద్రంలో చైనా పెరుగుతున్న దూకుడును జపాన్ నిరంతరం జాగ్రత్తగా గమనిస్తున్నది. జపాన్ పాలిత సెంకాకు దీవులను కూడా తమవిగా చైనా పేర్కొంటున్న నేపథ్యంలో చైనా నుంచి తమ దీవులను రక్షించుకునేదుకు జపాన్ ఈ సైనిక విన్యాసాలు చేపట్టింది. నాన్సీ ద్వీపాన్ని రక్షించే సామర్థ్యాన్ని కూడా జపాన్ పెంచుకుంటున్నది.
జపాన్ టైమ్స్ నివేదికల ప్రకారం, దాదాపు రెండు గంటలపాటు నిర్వహించిన విన్యాసాల్లో 3,100 మంది జపనీస్ సైనికులు, 45 ట్యాంకులు, సాయుధ వాహనాలు పాల్గొన్నాయి. వీటితోపాటు పోరాట హెలికాప్టర్లు కూడా పాలుపంచుకున్నాయి. కరోనా వైరస్ కారణంగా ప్రజలు సైనిక విన్యాసాలు తిలకించకుండా అడ్డుకున్నారు.
చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ జపాన్ రక్షణ చీఫ్ నోబువో కిషి జారీ చేసిన ప్రకటనను విమర్శించింది. తైవాన్ సమీపంలోని నాన్సీ ద్వీపం ఆందోళన కలిగించే విషయమని నోబువో కిషి అభివర్ణించగా.. చైనా తన భూములను కాపాడుకుంటున్నదని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియన్ తెలిపారు.
గతంలో జపాన్ ఆక్రమిత సెంకాకు దీవులపై ల్యాండ్‌స్కేప్ సర్వేను చైనా చేపట్టింది. చైనా దీనిని తన డియోయు ద్వీపం అని పిలుస్తుంది. చైనా సహజ వనరుల విభాగం సెంకాకుతో పాటు మరో రెండు ద్వీపాలను సర్వే చేసినప్పటి నుంచి చైనా దూకుడును జపాన్ అంచనా వేస్తూ వస్తున్నది. ఈ ద్వీపాన్ని జపాన్ ఆక్రమించినప్పటికీ, చైనా తన అధికారాన్ని నొక్కి చెప్తూనే ఉన్నది.
More Stories
ఆసియాన్ సదస్సులో వర్చువల్ గా మోదీ
రష్యా చమురు సంస్థలపై ట్రంప్ ఆంక్షలు
మహిళల కోసం జైషే ఆన్ లైన్ ‘జీహాదీ కోర్స్’