తౌక్టే తుపాను అరేబియా సముద్రాన్ని అల్లకల్లోలం చేస్తూ తీరం దాటకముందు నుంచే చేసిన నష్టాన్ని మర్చికోక ముందు మరో తుపాను భారత్‌ను ముంచెత్తుతోంది. ఈ నెల 22న తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించింది.
ఈ అల్పపీడనం వాయుగుండంగా మారి తుపానుగా దారి తీసే పరిస్థితి కనిపిస్తోంది. ఈ తుపాన్ కు ‘యాష్ అనే నామకరణం చేశారు. ఈ తుపాన్ ఈనెల 26న తూర్పు తీరాన్ని తాకే అవకాశాలున్నాయని ఐఎండి తెలిపింది.
దీంతో ఒడిశా, బెంగాల్ ప్రాంతాల్లో ఈ నెల 25న భారీ వర్షాలు కురుస్తాయని సీనియర్ సైంటిస్ట్ ఆర్కె జెనమణి తెలిపారు. అండమాన్ సముద్రానికి సమీపంలో బంగాళాఖాతంలో తుపానుగా మారి, మే 22 నుండి ఉత్తర, వాయువ్య దిశల్లో కదులుతోందని తెలిపారు. తుపాను ముప్పు పొంచి ఉన్న నేపధ్యంలో ఈనెల 22 నుండి సముద్రంలోకి మత్స్యకారులు వెళ్లరాదని సూచించారు.

More Stories
అరెస్ట్ కారణం లిఖితపూర్వకంగా తెలపాల్సిందే
‘ఓటు వేసే హక్కు’ ‘స్వేచ్ఛా ఓటింగ్’ కంటే భిన్నం
ఆర్ఎస్ఎస్ పై హైకోర్టులో సిద్ధరామయ్య సర్కారుకు ఎదురుదెబ్బ