చైనాను పంచన్‌ లామా స‌మాచారం అడిగిన అమెరికా

పంచన్‌ లామాకు సంబంధించిన స‌మాచారం ఇవ్వ‌మ‌ని అమెరికా చైనాను అడిగింది. స్వ‌తంత్ర నిపుణుడు ఆయ‌న‌ను క‌లిసేందుకు అవ‌కాశం ఇవ్వాల‌ని అమెరికా సూచించింది. దీనిపై చైనా ఇంత‌వ‌ర‌కు పెద‌వి విప్ప‌క‌పోవ‌డం విశేషం.
టిబెటన్ల‌ బౌద్ధ గురువు, 11 వ పంచన్ లామా ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలుపాలంటూ యూఎస్ కమీషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ (యూఎస్‌సీఐఆర్ఎఫ్‌) చైనా ప్రభుత్వాన్ని కోరింది. పంచన్ లామాను కేవలం ఆరు సంవత్సరాల వయసులో చైనా ప్ర‌భుత్వం త‌మ‌ బందీగా తీసుకున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. అనంత‌రం ఆయ‌న ఆచూకీ లేకుండా పోయింది.
దీనిపై ప‌లుసార్లు మాన‌వ హ‌క్కుల సంస్థ‌లు ప్ర‌శ్నిస్తున్న‌ప్ప‌టికీ చైనా మాత్రం పెద‌వి విప్ప‌డం లేదు. పంచ‌న్ లామా విష‌యంలో చైనా ప‌ట్ల క‌ఠినంగా వ్య‌వ‌హించాల‌ని యూఎస్‌సీఐఆర్ఎఫ్ అమెరికా ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తిచేసింది. దలైలామా తర్వాత టిబెటన్ బౌద్ధ గురు అయిన పంచన్ లామాను కలవడానికి స్వతంత్ర నిపుణుడిని అనుమతించాలని యూఎస్‌సీఐఆర్‌ఎఫ్ కమిషనర్ నాడిన్ మెన్జా డిమాండ్ చేశారు.
బెట‌న్ల బౌద్ధ గురువుగా 1989 ఏప్రిల్ 14 న గెలైన్ చోకి నిమాను 11 వ పంచన్ లామాగా దలైలామా ప్ర‌క‌టించారు. 1989 ఏప్రిల్ 25 న జన్మించిన గెలైన్‌ను చైనా ప్ర‌భుత్వం 1995 మే 15 న ఆయ‌న‌ ఆరేండ్ల‌ వయసులో అపహరించిందని మెన్జా ఆరోపించారు. అప్పటి నుంచి 11 వ పంచన్ లామా, అతని కుటుంబం గురించి ఎవరికీ సమాచారం లేదు.
చైనా ప్రభుత్వం 32 వ ఏర్పాటు దినోత్స‌వం సందర్భంగా గెలైన్ చోకి నిమాను విడుదల చేయాలని యుఎస్‌సీఐఆర్‌ఎఫ్ గత నెలలో డిమాండ్ చేసింది. ఇలాఉండ‌గా, బౌద్ధ మత స్వేచ్ఛపై ఆగ్ర‌హంతో ఉన్న చైనా.. లాసాలో ‘సాగా దావా’ అనే మత మాసంలో ఎటువంటి మతపరమైన కర్మలు చేయవ‌ద్దంటూ చైనా ఉత్త‌ర్వులు జారీ చేసింది.
ఈ ఆదేశాలు బుధవారం నుంచి అమ‌లులో ఉన్నాయి. ఈ కాలాన్ని బౌద్ధులు చాలా పవిత్రంగా భావిస్తారు. ఈ స‌మ‌యంలో ఎటువంటి పూజలు చేయవ‌ద్ద‌ని చైనా వారిపై నిషేధం విధించింది.