
పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ఎంపీ కారుపై శుక్రవారం కొందరు దాడి చేశారు. బంకురా నియోజకవర్గం ఎంపీ సుభాష్ సర్కార్ కారుపై జిల్లాలోని పటల్‌ఖురి గ్రామానికి సమీపంలో ఉన్న ఛటర్జీ బగన్ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు.
దీంతో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై బంకురా పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు బెంగాల్‌లో కొనసాగుతున్న రాజకీయ భీభత్సంలో భాగంగానే తన కారుపై దాడి జరిగిందని బీజేపీ ఎంపీ సుభాష్ సర్కార్ ఆరోపించారు. దాడి చేసిన వారి ముఖాలు కప్పి ఉన్నాయని, దీంతో వారిని తాను గుర్తించలేదని చెప్పారు.
అయితే రాజకీయ భీభత్సం చేస్తున్న వారు అధికార టీఎంసీ పార్టీకి చెందిన కార్యకర్తలేనని ఖచ్చితంగా చెప్పవచ్చని ఆయన స్పష్టం చేశారు.
More Stories
అమెరికాలో మొదలైన ‘షట్డౌన్’
దసరా, దీపావళి కానుక- ఉద్యోగులకు డీఏ 3 శాతం పెంపు
స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అభ్యర్థుల ఎంపిక ప్రారంభం