మహారాష్ట్రలో కోవిడ్-19 మహమ్మారి కట్టడికి తీసుకుంటున్న చర్యలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. శనివారం ఆయన ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేతో రాష్ట్రంలోని పరిస్థితిపై సమీక్షించారు. ఈ వివరాలను ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) ఓ ప్రకటనలో వెల్లడించింది.
ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేతో మోదీ ఫోన్ ద్వారా మాట్లాడారని సీఎంఓ ప్రకటన పేర్కొంది. కోవిడ్-19 మహమ్మారిపై పోరాటంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యల గురించి అడిగారని తెలిపింది.
రెండో ప్రభంజనంపై యుద్ధం జరుగుతున్న తీరును ప్రశంసించారని తెలిపింది. మూడో ప్రభంజనాన్ని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రణాళికను మోదీకి ఉద్ధవ్ వివరించినట్లు తెలిపింది.
రాష్ట్రంలో వ్యాక్సిన్ నిమిత్తం ప్రత్యేక యాప్ అభివృద్ధి చేసుకునేందుకు అనుమతినివ్వాలంటూ థాకరే రాసిన లేఖపై ప్రధాని చర్చించారని తెలుస్తోంది. కేంద్రం అభివృద్ధి చేసిన కొవిన్ యాప్‌లో అవాంతరాలు ఎదురౌతున్న నేపథ్యంలో థాకరే ఈ లేఖ రాశారు.

More Stories
బ్రిక్స్ సదస్సు కోసం ఢిల్లీకి చేరుకున్న పుతిన్
లడఖ్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తూ ఆర్టికల్ 371 సవరణ!
భారత్ అమ్ములపొదిలో 190 అణు వార్హెడ్లు