
ఢిల్లీ మెట్రో నిర్మాతగా పేరుప్రఖ్యాతులు పొందిన మెట్రోమ్యాన్ ఇ శ్రీధరన్ కేరళలోని పాలక్కాడ్లో ముందంజలో ఉన్నారు. బీజేపీ తరఫున ఆయన పోటీ చేశారు. ఆరువేల పైటిలుకు ఓట్ల మెజారిటీతో ఆయన గెలుస్తున్నారు.
కేరళలో నాలుగు స్థానాల్లో మాత్రమే ఆధిక్యత సాధించగలిగింది. పాలక్కాడ్ మీద బీజేపీ మొదటి నుంచీ ఆశలు పెట్టుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఈ నియోజకవర్గంలో రెండో స్థానంలో నిలిచింది. పైగా పాలక్కాడ్ నగర పాలక సంస్థలో బీజేపీ పాలక పక్షంగా ఉంది. యాక్షన్ హీరో సురేశ్ గోపీ, మరో ఇద్దరు పార్టీ అభ్యర్థులు కూడా ఆధిక్యతలో ఉన్నారు.
కాగా, కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో బిజెపి నేతృత్వంలోని ఎన్ డిఎ కూటమి ఆధిక్యంలో ఉంది. 30 అసెంబ్లీ స్థానాలు ఉన్న పుదుచ్చేరిలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇప్పటివరకు లెక్కించిన ఓట్ల ప్రకారం 11 స్థానాల్లో ఎన్ డిఎ ఆధిక్యంలో ఉంది. పుదుచ్చేరి, కైరాకల్, మాహి, యానాం ప్రాంతాల్లో పోలింగ్ జరిగింది. ఐఎన్ఆర్సీ 6, బీజేపీ 3 చోట్ల ఆధిక్యంలో ఉంది.
More Stories
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు
జర్మనీ వైపు చూస్తున్న భారతీయ విద్యార్థులు