సొరాబ్జీ భార‌త‌దేశ న్యాయ‌వ్య‌వ‌స్థ‌కు ప్ర‌తీక‌

భార‌త మాజీ అటార్నీ జ‌న‌ర‌ల్ సొలిసొరాబ్జీ మ‌ర‌ణం దేశానికి తీర‌ని లోటు అని రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ పేర్కొన్నారు. ఆయ‌న‌ దేశ న్యాయ‌వ్య‌వ‌స్థ‌కు ప్ర‌తీక అని కీర్తించారు. 

భార‌త రాజ్యాంగం, న్యాయ‌వ్య‌వ‌స్థ ఉన్న‌తి కోసం విశేష‌ కృషి చేసిన వారిలో సోలీ సొరాబ్జీ ఒక‌ర‌ని రాష్ట్ర‌ప‌తి కొనియాడారు. దేశంలోని ప్ర‌ముఖ న్యాయ‌కోవిదుల్లో ఒక‌రైన సోలీ సొరాబ్జిని భార‌త‌ ప్ర‌భుత్వం ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారంతో స‌త్క‌రించింద‌ని గుర్తుచేశారు.

అంత‌కుముందు రాష్ట్ర‌ప‌తి సొలి సొరాబ్జి మృతికి తీవ్ర సంతాపం వ్య‌క్తంచేశారు. ఆయ‌న కుటుంబ‌స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేశారు.

భార‌త మాజీ అటార్నీ జ‌న‌ర‌ల్ సొలి సొరాబ్జీ అత్యుత్త‌మ మేధావి అని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ కొనియాడారు. చ‌ట్టం ద్వారా నిరుపేద‌ల‌కు, అణగారిన వ‌ర్గాల వారికి సామం అందించ‌డంలో ఆయ‌న ముందుండే వార‌ని ప్ర‌ధాని గుర్తుచేసుకున్నారు.
 
 భార‌త అటార్నీ జ‌న‌ర‌ల్‌గా విశేష కృషి చేసిన సొరాబ్జి ఎప్ప‌టికీ గుర్తుండిపోతార‌ని వ్యాఖ్యానించారు. ఆయ‌న మృతికి తీవ్ర సంతాపం వ్య‌క్తంచేశారు. ఆయ‌న కుటుంబ‌స‌భ్యుల‌కు, అభిమానుల‌కు ప్రగాఢ సానుభూతి తెలియ‌జేశారు.