
దేశంలో కరోనా సెకెండ్ వేవ్ నేపథ్యంలో అత్యవసర ఆక్సిజన్ అవసరాలను తీర్చేందుకు పెద్ద సైజు ఆక్సిజన్ సిలెండర్లను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఏ) వివిధ ఆసుపత్రులకు అందజేస్తున్నట్టు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ తెలిపారు.
అలాంటి 75 పెద్ద సిలెండర్లను ఢిల్లీ ప్రభుత్వానికి గురువారంనాడు అందజేసినట్టు చెప్పారు. ఒక్కో సిలెండర్‌లోనూ 10,000 లీటర్ల ఆక్సిజన్ నిల్వ చేయవచ్చునని ఆయన తెలిపారు. ఇదే కెపాసిటీ ఉన్న 40 సిలెండర్లను రాధా సొయామి సత్సంగ్ బియస్ (ఆర్ఎస్ఎస్‌బీ) వద్ద నున్న సర్దార్ పటేల్ కోవిడ్ కేర్ సెంటర్‌కు పంపుతామని కూడా ఆయన హామీ ఇచ్చారు.
డీఆర్‌డీఓ సమకూరుస్తున్న ఈ సిలెండర్లకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్ సర్టిఫై చేయగా, పెట్రోలియం అండ్ ఎక్స్‌ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్, గవర్నర్‌మెంట్ ఆఫ్ ఇండియా ఆమోదం లభించింది. వీటిని గుజరాత్‌లో వడోదర నుంచి ఎయిర్‌లిఫ్ట్ ద్వారా తరలిస్తున్నారు.
ఈ తరహా సిలెండర్లను దేశంలోని మరిన్ని ఆసుపత్రులకు అందించే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని మంత్రిత్వ శాఖ వర్గాలు చెబుతున్నాయి.
More Stories
చంద్రయాన్-5 మిషన్‌కు కేంద్రం ఆమోదం
‘రైసినా డైలాగ్’ సదస్సు రేపే ప్రారంభం
వియత్నాంపై రాహుల్ కు అంత ప్రేమ ఎందుకో?