
Lieutenant Governor of Delhi Anil Baijal
ఢిల్లీ పరిపాలన బాధ్యతలు లెఫ్టినెంట్ గవర్నరుకు అప్పగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ‘ది గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ కాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (సవరణ) చట్టం 2021’ని అమలులోకి తీసుకువచ్చింది.
నూతనంగా అమలులోకి వచ్చిన ఈ చట్టం ప్రకారం ఇకపై ఢిల్లీ ప్రభుత్వం ఇకపై ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి తీసుకోవడం తప్పనిసరి. ఏప్రిల్ 27 అర్ధరాత్రి నుండి ఈ చట్టం అమలులోకి వస్తుందని కేంద్ర హోంశాఖ పేర్కొంది. 2021 మార్చి 22న ఈ బిల్లు లోక్సభలో, 24న రాజ్యసభలో ఆమోదముద్ర పడింది.
కరోనా రెండో దశ ఉధృతి సమయంలో విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడం, అమలు పరచడంలో ప్రస్తుతం అధికారంలో ఉన్నకేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా విఫలమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్రం తాజా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
More Stories
ఉగ్రవాదంపై విజయానికి ప్రతీక ఆపరేషన్ సిందూర్
శతాబ్ది సందర్భంగా `పంచ పరివర్తన్’పై ఆర్ఎస్ఎస్ దృష్టి
అక్టోబర్ 26 నుంచి భారత్- చైనాల మధ్య విమాన సర్వీసులు