
తెలంగాణాలో ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ లోటస్పాండ్లో వైఎస్ షర్మిల `కొలువు దీక్ష’ జరిపిన తర్వాత ఇందిరా పార్క్ నుంచి లోటస్ పాండ్ వరకు తలపెట్టిన పాదయాత్రను పోలీసులు భగ్నం చేశారు. ఇందిరా పార్క్ నుంచి పాదయాత్ర ప్రారంభించిన వెంటనే పోలీసులు అడ్డుకున్నారు.
అయినా కూడా ఆమె పాదయాత్ర కొనసాగించేందుకు యత్నించారు. ఈ క్రమంలో పోలీసుల దురుసుప్రవర్తనతో ఆమె ఒక దశలో స్పృహతప్పి పడిపోయారు. షర్మిల చేయికి బలమైన గాయమైంది. దీంతో లోటస్పాండ్కు ప్రత్యేక వైద్యబృందం చేరుకొని ఆమెకు వైద్య పరీక్షలు జరిపింది.
మరోవైపు లోటస్పాండ్కు షర్మిల అభిమానులు భారీగా చేరుకున్నారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తనకు గాయం కావడంతో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టబోనని షర్మిల ప్రతినబూనారు. తనను గాయపరిచారని, మరోసారి చేయిపడితే ఊరుకోబోనని షర్మిల హెచ్చరించారు. అంతకుముందు షర్మిలను అరెస్ట్ చేసి బేగంపేట మహిళా పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆ తర్వాత షర్మిల లోటస్పాండ్లో దీక్ష కొనసాగిస్తున్నారు.
తెలంగాణ ప్రజల కోసం తన కుమార్తె షర్మిల నిలబడిందని విజయలక్ష్మీ తెలిపారు. షర్మిల పోరాటం కొనసాగుతుందని ఆమె చెప్పారు. తెలంగాణలో ఉద్యోగాలు లేక ఎందరో ఆత్మహత్యలు చేసుకున్నారని ఆమె పేర్కొన్నారు. శాంతియుతంగా దీక్ష చేస్తుంటే పోలీసులు దౌర్జన్యం చేశారని మండిపడ్డారు.
షర్మిల దీక్షను గౌరవిస్తే ప్రభుత్వానికి గౌరవంగా ఉండేదని ఆమె పోలీసులు హింసాయుతంగా ప్రవర్తిస్తే ఆందోళనలుహితవు చెప్పారు. ఉధృతమవుతాయని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు అందరికీ ఉందని విజయలక్ష్మీ తెలిపారు. కాగా నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, ఉద్యోగాల నోటిఫికేషన్ భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ షర్మిల నిరాహార దీక్ష చేపట్టారు.
More Stories
గవర్నర్ ఆమోదం పొందని రిజర్వేషన్ల బిల్లులు
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత