
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై 24 గంటల ప్రచార నిషేధం విధించింది ఎన్నికల సంఘం. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా ఈ చర్య తీసుకోవడం గమనార్హం. ముస్లిం ఓట్లు, కేంద్ర బలగాలపై తిరబడండి అన్న వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది.
దీనిపై ఎన్నికల కమిషన్కు బీజేపీ ఫిర్యాదు చేసింది. ఆమె వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నిబంధనావళికి విరుద్ధమంటూ ఆ ఫిర్యాదులో బీజేపీ పేర్కొంది. ఈ అంశంపై మమతా బెనర్జీకి ఎన్నికల కమిషన్ రెండు నోటీసులు కూడా ఇచ్చింది.
సోమవారం రాత్రి 8 గంటల నుంచి మంగళవారం రాత్రి 8 గంటల వరకూ ఈ నిషేధం అమల్లో ఉంటుంది. నిషేధ సమయంలో ఆమె ఏ రూపంలోనూ ప్రచారం చేయకూడదు.
గత వారమే ఆమెకు రెండు నోటీసులు జారీ చేశారు. బెంగాల్లో మరో నాలుగు విడతల ఎన్నికలు మిగిలి ఉన్నాయి. మమతపై నిషేధం కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి సునీల్ అరోరాకు చివరిది కావడం గమనార్హం. సోమవారంతోనే ఆయన పదవీకాలం ముగిసింది.
More Stories
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు
జర్మనీ వైపు చూస్తున్న భారతీయ విద్యార్థులు