బెంగాల్ ఎన్నికలు హింసాత్మకం …. నలుగురు మృతి 

పశ్చిమబెంగాల్‌లో నాలుగో విడత ఎన్నికలు హింసాత్మకంగా మారాయి. శనివారం కూచ్‌బిహార్‌లోని సితాల్‌కుచి ప్రాంతంలో కేంద్ర బలగాలు జరిపిన కాల్పుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు సీఐఎస్‌ఎఫ్‌ బలగాలపై దాడిచేసి, తుపాకులు లాక్కునేందుకు యత్నించారని.. దీంతో స్వీయరక్షణ కోసమే కాల్పులు జరిపినట్టు ఓ పోలీస్‌ అధికారి తెలిపారు.

 సితాల్‌కుచిలోనే మరో ఘటనలో ఓ యువకుడిని దుండుగులు కాల్చిచంపారు. ఈ ఘటనలపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. హింసాకాండపై సీఐడీతో దర్యాప్తు జరిపిస్తామని పేర్కొ న్నారు. మరోవైపు, హింసకు తృణమూల్‌ కాంగ్రెసే కారణమని ప్రధాని మోదీ ఆరోపించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరారు.

కూచ్‌బిహార్‌ జిల్లా రణరంగాన్ని తలపించింది. సీతల్‌కుచి ప్రాంతంలో స్థానికులు సీఐఎస్‌ఎఫ్‌ బలగాలపై దాడి చేసి వారి తుపాకులు లాక్కునేందుకు ప్రయత్నించినట్టు ఓ పోలీస్‌ అధికారి తెలిపారు. దీంతో స్వీయ రక్షణ కోసం బలగాలు కాల్పులు జరిపినట్టు వెల్లడించారు. మృతిచెందిన నలుగురూ తమ మద్దతుదారులేనని తృణమూల్‌ కాంగ్రెస్‌ తెలిపింది. మాతాబంగా పోలింగ్‌ కేంద్రం వద్ద ఉదయం ఈ ఘటన జరిగినట్టు సీఐఎస్‌ఎఫ్‌ వర్గాలు తెలిపాయి.

 దీంతో ఆ పోలింగ్‌ కేంద్రంలో రీపోలింగ్‌ నిర్వహించనున్నట్టు ఎన్నికల సంఘం (ఈసీ) వెల్లడించింది. మరోవైపు, సీతల్‌కుచి నియోజకవర్గంలోనే అంతకుముందు ఓ పోలింగ్‌ బూత్‌లో యువ ఓటరును దుండగులు కాల్చిచంపారు. ఈ హత్య వెనుక బీజేపీ హస్తముందని తృణమూల్‌ ఆరోపించింది. 

అయితే బాధితుడు తమ పోలింగ్‌ ఏజెంట్‌ అని, తృణమూల్‌ కార్యకర్తలే అతడిని హత్య చేశారని బీజేపీ ప్రత్యారోపించింది. ఇంకోవైపు, వేర్వేరు ఘటనల్లో ఒక టీఎంసీ అభ్యర్థి, నలుగురు బీజేపీ అభ్యర్థులపై దాడులు జరిగాయి. కాగా, శనివారం 5 గంటల సమయానికి 76.16% పోలింగ్‌ నమోదైనట్టు ఈసీ తెలిపింది. 

మరోవంక, పశ్చిమ బెంగాల్‌లోని కూచ్‌ బెహర్‌ జిల్లాకు రాజకీయ నేతల రాకను ఎన్నికల కమిషన్‌ నిషేధించింది. నాలుగో విడుత పోలింగ్‌ నేపథ్యంలో శనివారం సితాల్‌కుచి నియోజ‌క‌వ‌ర్గంలో సీఐఎస్‌ఎఫ్‌ జవాన్లు జ‌రిపిన కాల్పుల్లో న‌లుగురు మరణించారు. దీంతో అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఈ నేపథ్యంలో ఈ జిల్లాకు మూడు రోజుల పాటు రాజకీయ నేతలెవరూ రావద్దని ఈసీ ఆదేశించింది. కాల్పులు జరిగిన ప్రాంతాన్ని ఆదివారం సందర్శిస్తానని, దీనికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతానని సీఎం మమత ప్రకటించిన నేపథ్యంలో ఈసీ ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకున్నది.

పశ్చిమ బెంగాల్‌లో శనివారం జరిగిన నాలుగో విడుత ఎన్నికలు హింసాత్మకంగా మారిన నేపథ్యంలో అదనంగా 71 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు దళాలు (సీఏపీఎఫ్‌)ను వెంటనే తరలించాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. ఈ నేపథ్యంలో 33 కంపెనీల బీఎస్‌ఎఫ్‌, 12 కంపెనీల సీఆర్పీఎఫ్‌, 13 కంపెనీల ఐటీబీపీ, 9 కంపెనీల ఎస్‌ఎస్‌బీ, 4 కంపెనీల సీఐఎస్‌ఎఫ్‌ దళాలను వెంటనే మోహరించనున్నారు.

కూచ్ బెహ‌ర్ జిల్లాలోని సితాల్‌కుచి నియోజ‌క‌వ‌ర్గంలో శనివారం సీఐఎస్‌ఎఫ్‌ జ‌రిపిన కాల్పుల్లో న‌లుగురు చ‌నిపోయారు. మరో ఘర్షణలో ఒకరు మరణించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో 126వ బూత్‌లో పోలింగ్‌ను ఈసీ వాయిదా వేసింది.