
1. ఆజాద్ కాలేజీ వివరాలు, మేనేజ్మెంట్ ఎవరు, ట్రస్టీలు ఎవరు, ఆ కాలేజీ విధివిధానాలు ఏమిటి?
2. ఆజాద్ కాలేజీలో రహస్యంగా ఉంచిన విద్యార్థుల వయసు, ప్రాంతం మొదలైన వివరాలు
3. ఆజాద్ కాలేజీలో రహస్యముగా ఉంచిన విద్యార్థుల ను ఏ ప్రాతిపదికన అక్కడ చేర్చుకోవడం జరిగింది..?
4. విద్యార్థులను కాలేజీలో రహస్యంగా ఉంచిన వ్యక్తులు ఎవరు, విద్యార్థులను ఆ వ్యక్తులు ఏ రకంగా తరలించారు.?
5. ఆజాద్ కళాశాలలో ఉండేందుకు విద్యార్థులకు ఎలాంటి ఫీజులైనా కాలేజీకి చెల్లిస్తున్నారా? ఒకవేళ చెల్లించకపోతే వారికి నిధులు ఏ సంస్థ నుండి వస్తున్నాయి? ఎవరు ఇస్తున్నారు?
6. రెసిడెన్షియల్ స్టూడెంట్స్ ని ఉంచడానికి విద్యా సంస్థలకు, హాస్టళ్ళకు రాష్ట్ర ప్రభుత్వం విధించిన నియమ నిబంధనలు ఏమిటి?
7. ఈ అంశంలో కోవిడ్ నియమ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన వ్యక్తులు, బాధ్యులు ఎవరు? వారి వివరాలు ఏమిటి!
పైన కోరిన వివరాలు అన్ని 10 రోజులలోగా జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కి నివేదిక ఇవ్వాల్సిందిగా జిల్లా కలెక్టర్ ని ఆదేశించారు. నోటీసుకు కాపీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేష్ కుమార్ కు కూడా పంపారు. దీనితో పాటు ఈ సంఘటనకు బాధ్యులైన వారిపై ఎఫ్.ఐ.ఆర్ రిజిస్టర్ చేయాల్సిందిగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ కి ఆదేశాలు జారీచేశారు. ఆజాద్ కాలేజీ యాజమాన్యంపై చర్యలు పరిశీలించమని అఖిల భారతీయ సాంకేతిక విద్యామండలికి కమిషన్ సూచించింది.
More Stories
రూ. 1 లక్ష కోట్లతో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా తొలి బడ్జెట్
నాపై సెటైర్లు వేయడానికి కమ్రా సుపారి తీసుకున్నట్లుంది
కెనడా ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకునే అవకాశం!