దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు వీకే శశికళకు మరో షాక్ తగిలింది. ఓటరు జాబితాలో ఏకంగా ఆమె పేరు గల్లంతైంది. శాసనసభ ఎన్నికల పోలింగ్‌కు ఒక్కరోజు ముందు ఈ విషయం వెలుగులోకి రావడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఆమెను రాజకీయాల నుంచి తప్పించినట్టు.. ఓటేసే అవకాశం కూడా ఇవ్వలేదని తమిళనాడులో చర్చ నడుస్తోంది.
‘రాజకీయాల్లోకి రానివ్వరు.. కనీసం ఓటు కూడా వేయనివ్వరా? అని ఆమె అభిమానులు ప్రశ్నిస్తున్నారు. 20 ఏండ్లుగా థౌజండ్ లైట్స్ నియోజకవర్గంలో ఆమెకు ఓటు హక్కు ఉంది. కాగా పోయెస్ గార్డెన్‌లోని ఆస్తులను జప్తు చేశాక ఆమె పేరును అధికారులు తొలగించారని సమాచారం.
ఈ విషయమై ఆమె మేనల్లుడు, ఏఎంఎంకే అధినేత టీవీవీ దినకరన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఓటరు జాబితాలో శశికళ పేరు కనిపించకపోవడం ముఖ్యమంత్రి పళనిస్వామినే బాధ్యత వహించాలని డిమాండ్ చేశాడు. శశికళ ఓటేయకుండా అన్నాడీఎంకే చేసిందని మండిపడ్డాడు.
అక్రమాస్తుల కేసులో నాలుగేండ్లు జైలుశిక్ష అనుభవించిన శశికళ జనవరి 27న విడుదలయ్యారు. అనంతరం రాజకీయాల నుంచి తప్పుకుంటూ అనూహ్య నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

More Stories
బీహార్ లో అన్ని ఎన్నికల రికార్డ్లను బ్రేక్ చేస్తాం
వందేళ్లైనా జంగల్ రాజ్యాన్ని బిహార్ ప్రజలు మరిచిపోరు
కొత్త సీజేఐ నియామకంపై కసరత్తు!