ఆయుధాలు వదిలి పెట్టండి… ప్రధాని పిలుపు!

హింసా మార్గంలో ప‌య‌నిస్తున్న మిలిటెంట్లు ఆయుధాల‌ను వ‌దిలిపెట్టి ప్ర‌జాజీవితంలో క‌లిసి పోవాల‌ని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపిచ్చారు. అస్సాంలో త‌ముల్‌పుర్‌లో జ‌రిగిన స‌భ‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ శాంతియుత ఆత్మ‌నిర్భ‌ర్ అస్సాంను నిర్మించేందుకు క‌లిసి రావాలని కోరారు.
త‌ల్లులు, సోద‌రీమ‌ణుల‌కు హామీ ఇస్తున్నాని, మీ పిల్ల‌లు ఆయుధాలు ప‌ట్టుకోరు అని, వాళ్లు త‌మ జీవితాల‌ను అడ‌వుల్లో గ‌డ‌పాల్సిన అవ‌స‌రం లేద‌ని, ఎటువంటి బుల్లెట్ల‌కు నేల‌రాల‌వ‌ద్దు అని ఆయ‌న స్పష్టం చేశారు. అస్సాం ఐడెంటిటీని అవమానించేవారిని, హింస‌ను ప్రోత్స‌హించేవారిని అస్సామీ ప్ర‌జ‌లు బ‌హిష్క‌రిస్తార‌ని కాంగ్రెస్ కూట‌మిని ఆయ‌న హెచ్చరించారు.
 
అసోంలో శాంతి, అభివృద్ధి సుస్థిరంగా ఉండాలంటే బీజేపీ కూటమికి ఓటు వేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. గతంలో పాలించిన ప్రభుత్వాలు అసోం గుర్తింపునే ధ్వంసం చేశాయని మండిపడ్డారు. తమది ‘డబుల్ ఇంజిన్ ప్రభుత్వం’’ అని పేర్కొంటూ రాష్ట్రంలోని ప్రజల జీవితాలను, ముఖ్యంగా మహిళల జీవితాలు సౌకర్యవంతం కావడానికి తమ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని తెలిపారు. 
గ‌త అయిదేళ్ల‌లో అస్సాం అద్భుతమైన అభివృద్ధిని చూసినదని చెబుతూ  బూపెన్ హ‌జారికా సేతు, బోగిబీల్ బ్రిడ‌జ్‌ల‌ను నిర్మించామ‌ని, మ‌రో అర‌డ‌జ‌న బ్రిడ్జ్‌లు నిర్మాణంలో ఉన్నాయ‌ని గుర్తు చేశారు.  తాము మేం ఏదైనా స్కీమ్‌ను రూపొందిస్తే, దాని ఫ‌లితాలు అంద‌రికీ అందేలా చూస్తామ‌ని, స‌బ్‌కా సాత్‌, స‌బ్‌కా వికాశ్ త‌మ నినాద‌మ‌ని ప్ర‌ధాని మోదీ హామీ ఇచ్చారు.
సమాజంలో వివక్ష ప్రదర్శించడం, సమాజాన్ని విడదీయడం, ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తే వారిని లౌకికవాదులు అని అంటున్నారని, అందరి కోసం పాటుపడితే వారిని మతతత్వ వాదులు అంటున్నారని మండిపడ్డారు. అటు లౌకికవాదం, ఇటు మతతత్వం రెండూ దేశానికి పెద్ద ప్రమాదమని మోదీ పేర్కొన్నారు. 

పవిత్ర స్థలాలను అస్థిరపరిచస్తే చూస్తూ ఊరుకోమని అంతకు ముందు కేరళలోని కొచ్చిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని స్పష్టం చేశారు.  శబరిమలతో పాటు రాష్ట్రంలోని ఆలయాలను అధికార ఎల్డీఎఫ్ సర్కార్ అస్థిర పరిచే కుట్ర పన్నుతోందని మోదీ ఆరోపించారు. 

‘స్వామియే శరణం అయ్యప్ప. అయ్యప్ప ఆశీస్సులతో ఏర్పడిన ఈ పవిత్ర నేలకు రావడం ఆనందాన్ని ఇస్తోంది. స్వామి అయ్యప్ప ఎప్పుడూ స్పెషలే. దయతో ఉంటూ ఇతరులకు సాయం చేయడానికి ఉన్న విశిష్టతను అయ్యప్ప నుంచి నేర్చుకోవాలి’ అని ప్రధాని చెప్పారు. 

అయితే, అధికార ఎల్డీఫ్ చేస్తోందేంటి? స్వామి భక్తులను పూలతో స్వాగతం పలకాల్సిన చోట లాఠీలతో బాదారని ప్రధాని మండిపడ్డారు. అయ్యప్ప భక్తులు అమాయకులు. వాళ్లు నేరస్థులు కాదని ఆవేదన వ్యక్తం చేశారు. పలు దశాబ్దాలుగా మన సనాతన ధర్మాన్ని, ఆచార, సంప్రదాయాలను తక్కువ చేసి చూపడం లెఫ్ట్ పార్టీలకు అలవాటుగా మారిందని ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు.