తమిళనాడు శాసన సభ ఎన్నికల వేళ డీఎంకే అధినేత స్టాలిన్ అల్లుడు శబరీశన్ ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ (ఐటీ శాఖ) శుక్రవారం ఉదయం నుంచి సోదాలు చేస్తోంది. నీలాంగరాయ్‌లోని ఆయన నివాసంతోపాటు నాలుగు చోట్ల సోదాలు జరుగుతున్నాయి.
నీలాంగరాయ్‌లోని నివాసంలో శబరీశన్, ఆయన సతీమణి సెంతమార్తె నివసిస్తున్నారు. ఈ ఇంట్లో కూడా ఐటీ సోదాలు జరుగుతున్నాయి. తమిళ నాడు శాసన సభ ఎన్నికలు ఏప్రిల్ 6న జరుగుతాయి. డీఎంకే నేతలపై ఐటీ దాడులు జరగడం ఇది రెండోసారి.
గత నెలలో సీనియర్ డీఎంకే నేత ఈవీ వేలుకు చెందిన 10 చోట్ల ఐటీ సోదాలు జరిగాయి. ఎన్నికల ప్రచారం కోసం నిధులను రవాణా చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం రావడంతో సోదాలు నిర్వహిస్తున్నట్లు ఐటీ శాఖ అధికారులు తెలిపారు. వేలు నుంచి పెద్ద మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.
ఇదిలావుండగా, శబరీశన్‌పై పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. ఆయన డిప్యూటీ స్పీకర్ వీ జయరామన్‌పై వదంతులు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. జయరామన్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. పొల్లాచ్చి సెక్సువల్ అబ్యూజ్, బ్లాక్‌మెయిల్ కేసులో తనపైనా, తన కుటుంబ సభ్యులపైనా వదంతులు ప్రచారం చేస్తున్నారని శబరీశన్‌పై జయరామన్ ఫిర్యాదుచేశారు.
More Stories
హైదరాబాద్ లోనూ అమెరికా అధ్యక్షుడి స్కై స్క్రేపర్స్!
ఎయిర్ ఇండియా- విస్తారా విలీనం పూర్తి
‘స్పామ్ ట్రాకింగ్ సిస్టమ్’తో రోజూ 1.35 కోట్ల ఫ్రాడ్ కాల్స్ బ్లాక్