ముగిసిన 2020-21 ఆర్ధిక సంవత్సరంలో రాష్ట్రాలకు కేటాయించే సాధారణ నిధులకు మించి రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్రం అదనంగా రూ 2,810 కోట్లు కేటాయించింది. ఆంధ్ర ప్రదేశ్ కు రూ 1850 కోట్లు అదనంగా కేటాయించగా, తెలంగాణకు అదనంగా రూ 960 కోట్లు కేటాయించింది.
2020-21లో రాష్ట్రాలకు కేటాయించిన అదనపు నిధుల వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. 2020-21 ఏడాదిలో రాష్ట్రాలకు పన్నుల వాటాకింద రూ 45 వేల కోట్లు అదనంగా కేటాయించినట్లు ఆర్థిక శాఖ తెలిపింది.
పన్నులు, సుంకాల కింద రాష్ట్రాలకు ఇచ్చే నిధుల వాటాకి అదనంగా 8.2 శాతం నిధుల కేటాయించింది. 2020-21లో ఏపీకి రూ 22,611 కోట్లు చెల్లించాల్సి ఉండగా రూ 24,461 కోట్లు కేంద్రం చెల్లించింది. అంటే, ఏపీకి అదనంగా రూ 1850 కోట్లు కేంద్రం కేటాయించింది.
దీంతో పాటుగా 2020-21లో తెలంగాణకి రూ 11,732 కోట్లు చెల్లించాల్సి ఉండగా రూ 12,692 కోట్లు కేంద్రం చెల్లించింది. అంటే, తెలంగాణకి అదనంగా రూ 960 కోట్లు కేటాయించినట్లు ఆర్థిక శాఖ పేర్కొంది.

More Stories
కేంద్రంపై మంత్రి పొన్నం ప్రభాకర్ తప్పుడు ఆరోపణలు
గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేసిన శివప్రతాప్ శుక్లా
దానం, కడియంలకు స్పీకర్ క్లీన్చిట్.. మండిపడ్డ ప్రతిపక్షాలు