రఘురామరాజు కంపెనీపై సీబీఐ కేసు

వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు చెందిన కంపెనీపై సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఆయన, ఆయన కుటుంబ సభ్యులు డైరెక్టర్లుగా ఉన్న ఇంద్‌భరత్‌ పవర్‌ జెన్‌కాం లిమిటెడ్‌ కంపెనీ తమను తీవ్రంగా మోసగించిందని, నకిలీ డాక్యుమెంట్లు సమర్పించిందని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 

అవి తమ నిధులను దాదాపు రూ.237.84 కోట్ల మేర స్వాహా చేసిందని ఆరోపిస్తూ బ్యాంకుల కన్సార్షియం తరఫున స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చెన్నై శాఖ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ రవిచంద్రన్‌ చేసిన ఫిర్యాదును సీబీఐ పరిగణనలోకి తీసుకుంది.

ఈ కంపెనీ ఎస్‌బీఐకి రూ.107.57 కోట్లు, యాక్సిస్‌ బ్యాంకుకు రూ.123.65 కోట్లు, సిండికేట్‌ బ్యాంకు రూ.46.05 కోట్లు, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు రూ.13.95 కోట్లు, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకుకు రూ.6.62 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని, ఇంకా యూకో బ్యాంకు, ఐఎల్‌ఎ్‌ఫఎస్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు నుంచి వివరాలు రావలసి ఉందని సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది.