తిరుపతిలో 2 లక్షల దొంగవోట్లకు రంగం సిద్ధం 

తిరుపతిలో 2 లక్షల దొంగవోట్లకు రంగం సిద్ధం 

తిరుపతి ఎన్నికల్లో ఇప్పటికే రెండు లక్షల దొంగ ఓట్లను వేసేందుకు ఆధార్‌ కార్డులు తయారు చేసినట్టు సమాచారం వచ్చిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు.  ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లోనూ చాలా దొంగ ఆధార్‌ కార్డులు, ఓటరు కార్డులు గుర్తించారని వాటిని మీడియా సమక్షంలో చూపించారు.

దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. ఏపీలో ప్రజలు బీజేపీని గెలిపించకపోయినా బీజేపీ మాత్రం రాష్ట్రంపై ఎప్పుడూ చిన్నచూపు చూడలేదని వీర్రాజు స్పష్టం చేశారు. ఇప్పటికే 503 ప్రాజెక్టులను ఎంపిక చేశారని,రూ.8 లక్షల కోట్లు త్వరలోనే ఇవ్వబోతున్నారని తెలిపారు. 

వలంటీర్ల వ్యవస్థను అడ్డంపెట్టుకుని ప్రజాధనాన్ని దురి్వనియోగం చేయడమే కాకుండా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని అధికారమలో ఉన్న వైసిపి ప్రభుత్వాన్ని ఎండగట్టారు.  తిరుపతి ఉపఎన్నికలో బీజేపీకి ఒక్క అవకాశం ఇచ్చి చూడాలని వీర్రాజు ప్రజలను కోరారు. రైల్వే ప్రాజెక్టులు, సాగరమాల, కోవిడ్‌ సమయంలో రాష్ట్రానికి ఎంతో నిధులు ఇచ్చినట్టు చెప్పారు. 

తిరుపతి ప్రాంతంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలే ప్రధాన అజెండాగా లోక్ సభ ఉపఎన్నికల్లో పొతే చేస్తున్నట్లు వెల్లడించారు. తిరుపతి అభివృద్ధిపై తమతో బహిరంగ చర్చకు రావాలని ఆయన గతంలో వైసీపీ, టిడిపి నేతలకు సవాల్ కూడా విసిరారు.