
గత మూడు వారాలుగా దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు స్థిరంగా ఉన్నాయి. ఈ కాలంలో అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు మాత్రం భారీగా తగ్గాయి. గత 10-14 రోజుల్లోనే ముడి చమురు ధరలు పది శాతం మేర తగ్గడం గమనార్హం.
అయితే ఈ తగ్గిన ధరలను ఆయిల్ కంపెనీలు వినియోగదారులకు బదిలీ చేయాలని నిర్ణయిస్తే మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశాలున్నాయి. రెండు వారాల కిందట బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 70 డాలర్లు కాగా అది ఇప్పుడు 63.98 డాలర్లకు చేరింది.
ఇక అటు యూఎస్ క్రూడ్ ఆయిల్ అయితే బ్యారెల్‌కు 60.94 డాలర్లకు తగ్గింది. ముడి చమురు ఉత్పత్తి పెరగడం, కరోనా కారణంగా కొన్ని దేశాలు మళ్లీ లాక్‌డౌన్ విధించడంతో ముడిచమురు ధరలు తగ్గిపోయాయి.
More Stories
అమెజాన్, వాల్మార్ట్లపై ఆంక్షలు తొలగింపుకై వత్తిడి
జులైలో పట్టాలపైకి దేశంలో తొలి హైడ్రోజన్ రైలు
మార్కెట్లో ప్రవేశించిన రూ 500 నకిలీ నోట్లు