షోపియాన్లో జిల్లాలో భద్రతా దళాలు-ఉగ్రవాదులకు మధ్య భారీగా ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో నలుగురు ఉగ్రవాదులను భారత భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.
షోపియాన్ జిల్లాలోని మునిహల్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భద్రతాబలగాలు గాలింపు చేపట్టాయి. ఆ ప్రాంతంలో తనిఖీలు చేస్తుండగా..భారత భద్రతా దళాలపై ముష్కర్లు కాల్పులకు తెగబడ్డారు. దీంతో భారత జవాన్లు వారికి ధీటుగా సమాధానం ఇచ్చారు. ఈ కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులను హతమార్చారు.
మృతి చెందిన నలుగురు ఉగ్రవాదులు లష్కరే తోయిబాకు చెందిన వారని పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలం నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్న భద్రతా దళాలు ఆపరేషన్ను కొనసాగిస్తున్నాయి.

More Stories
అరెస్ట్ కారణం లిఖితపూర్వకంగా తెలపాల్సిందే
‘ఓటు వేసే హక్కు’ ‘స్వేచ్ఛా ఓటింగ్’ కంటే భిన్నం
ఆర్ఎస్ఎస్ పై హైకోర్టులో సిద్ధరామయ్య సర్కారుకు ఎదురుదెబ్బ