ఆంధ్ర ప్రదేశ్రా ష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్గా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎం.సీతారామమూర్తి నియమితులయ్యారు. మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్, సభ్యుల ఎంపికపై సచివాలయంలో సిఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది.
వైసిపి హయాంలో అరాచకాలు ఎక్కువయ్యాయంటూ టిడిపి బహిష్కరించింది. దీంతో, శాసనసభ, మండలిలో ప్రతిపక్ష నేతలు చంద్రబాబునాయుడు, యనమల రామకృష్ణుడు సమావేశానికి హాజరు కాలేదు.
రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత ఛైర్మన్, సభ్యుల పేర్లను ప్రతిపాదించగా, కమిటీ ఆమోదం తెలిపింది. మానవ హక్కుల కమిషన్ సభ్యులుగా విశ్రాంత జిల్లా న్యాయమూర్తి దండే సుబ్రహ్మణ్యం (జ్యుడీషియల్), న్యాయవాది డాక్టర్ జి.శ్రీనివాసరావు (నాన్ జ్యుడీషియల్)ను నియమించారు. సమావేశానికి శాసన మండలి ఛైర్మన్ ఎంఎ షరీఫ్, శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం హాజరయ్యారు.

More Stories
దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ భారత్ కైవసం
వచ్చే 50 ఏళ్లకు ఒంటిమిట్ట ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్
దేవాలయాలకు మొదటి సంరక్షకులు న్యాయస్థానాలే