బండి సంజయ్ పై కోదాడలోస్వేరోస్ మూకల దాడి 

సూర్యాపేట జిల్లాలోని కోదాడలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వాహనాన్నిస్వేరో కార్యకర్తలు అడ్డుకుని ఆయనపై దాడి చేసే ప్రయత్నం చేయడంతో బుధవారం సాయంత్రం తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బీజేపీ, స్వేరోస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. సూర్యాపేట బీజేపీ జిల్లా అధ్యక్షుడు భాగ్యరెడ్డి కారుపై దాడి చేశారు. దీంతో కారు అద్దాలు పగలిపోయాయి.

గుర్రంబోడు తండా ఘటనలో జైలుకు వెళ్లి బెయిల్‌పై విడుదలైన నాయకులు, కార్యకర్తల అభినందన సభలో పాల్గొనేందుకు బండి సంజయ్‌ బుధవారం హుజూర్‌నగర్‌కు వచ్చారు. జైలు నుంచి బెయిల్‌పై విడుదలవుతున్న కార్యకర్తలకు స్వాగతం పలికేందుకు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో భారీ కాన్వాయ్‌తో సబ్‌జైలుకు బయలుదేరారు. ఇదే సమయంలో స్వేరో కార్యకర్తలు పట్టణంలోని పొట్టి శ్రీరాములు సెంటర్‌ వద్ద సంజయ్‌ కాన్వాయ్‌ని అడ్డుకుని, కర్రలు, రాళ్లతో దాడి చేశారు. 

అప్రమత్తమైన బీజేపీ కార్యకర్తలు వారిని ప్రతిఘటించారు. దీంతో ఆ ప్రాంతం రణరంగంగా మారింది. ఈ క్రమంలోనే స్వేరో కార్యకర్తలను దాటుకుని సంజయ్‌ కాన్వాయ్‌ సబ్‌జైలు వైపునకు వెళ్లింది. సబ్‌జైలు నుంచి కార్యకర్తలతో తిరిగి వస్తుండగా పోలీ్‌సస్టేషన్‌ ఎదుట మరోసారి స్వేరో కార్యకర్తలు దాడికి యత్నించారు.బీజేపీ కార్యకర్తలు ప్రతిఘటించడంతో వెనుదిరిగారు. 

ఈ సమయంలో స్వేరో ప్రతినిధులు జైబీమ్‌, జై ప్రవీణ్‌ అంటూ నినాదాలు చేయగా.. ప్రతి గా బీజేపీ నాయకులు జైశ్రీరామ్‌ అంటూ నినాదాలు చేశారు. దీంతో అక్కడా కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. 

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడ బండి సంజయ్‌పై జరిగిన హత్యాయత్నాన్ని మాజీ మంత్రి విజయరామారావు, బీజేపీ ఎస్సీ మోర్చా తెలంగాణ అధ్యక్షుడు కొప్పు బాషా, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్‌. కుమార్‌ తదితరులు తీవ్రంగా ఖండించారు. సంజయ్‌పై దాడికి పాల్పడ్డ వారిని గుర్తించి వారిపై చట్టప్రకారం కఠిన చర్య లు తీసుకోవాలని బీజేపీ తెలంగాణ శాఖ నేతలు డిమాండ్‌ చేశారు. 

హిందూ దేవుళ్లను కించపరిచే విధంగా ఐపీఎస్ అధికారి  ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ చేసిన ప్రమాణంపై సంజయ్ ఘాటుగా స్పందించారు. సంజయ్ వ్యాఖ్యలకు నిరసనగా ఆయనపై స్వేరోలు దాడికి యత్నించారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నడుమ హైదరాబాద్‌కు సంజయ్ తిరుగు ప్రయాణం అయ్యారు. తమ నేతపై హత్యాయత్నంకు పాల్పడ్డారని బిజెపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘నాకు రాముని మీద, కృష్ణుని మీద నమ్మకం లేదు. నేను వాళ్లను పూజించను. నాకు గౌరి మీద, గణపతి మీద, ఇతర హిందూ దేవతలెవరి మీదా నమ్మకం లేదు. నేను వాళ్లను పూజించను. నేను దేవుని అవతారాల సిద్ధాంతాలను నమ్మను గాక నమ్మను. ఇది కుట్రతో కూడిన తప్పుడు ప్రచారమని నమ్ముతున్నాను” అంటూ వందలాది మంది ప్రతిజ్ఞ చేస్తున్న వీడియో ఒకటి సోమవారంనాడు సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అయ్యింది.

ఆ ప్రతిజ్ఞా కార్యక్రమంలో.. గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ కూడా ఉండడంపై హిందూ సంస్థల నుండి తీవ్ర ఆగ్రవేశాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రవీణ్ కుమార్ ను  సస్పెండ్ చేసి, దర్యాప్తు జరపాలని డిమాండ్లు చేస్తున్నాయి.   ప్రతిజ్ఞలో ఇంకా ” నేను శ్రాద్ధకర్మలను పాటించను. పిండ దానాలు చేయ ను. నేను బుద్ధుడు ప్రవచించిన సూత్రాలకు, ప్రబోధాలకు ఏమాత్రం వ్యతిరేకమైన విధంగా ప్రవర్తించను.’’ అంటూ కూడా పేర్కొన్నారు. 

స్వేరో  పవిత్ర మాసం సందర్భంగా పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం వడుకాపూర్‌, ధూళికట్ట గ్రామాల మధ్యగల బౌద్ధస్తూపం వద్ద పాలరాతి బుద్ధవిగ్రహాన్ని సోమవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ప్రవీణ్‌కుమార్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. హిందూ దేవుళ్లకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞా కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఆయన కూడా చేయి చాచి నిలబడ్డారు.

ఈ ప్రమాణంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. “సమాజంలో వైషమ్యాలు సృష్టిస్తున్న స్వేరోస్ సంస్థపై వెంటనే చర్య తీసుకోవాలి. సీఎం కేసీఆర్ ప్రోద్బ‌లంతోనే హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ కుట్ర జరుగుతోంది. ఈ సంస్థకు నిధులెక్కడి నుంచి వస్తున్నాయి? మీరు లెక్కలు తీస్తారా? కేంద్రానికి ఫిర్యాదు చేసి అక్కడి నుంచి తీయించమంటారా?” అని నిలదీస్తూ  సంజ‌య్ ట్వీట్ చేశారు.

 ‘హిందువులను కించపరిచే కార్యక్రమాలు జరుగుతుంటే ఇంటెలిజెన్స్ ఏమి చేస్తోంది? చాలా ఏళ్లనుంచి ఈ కుట్ర జరుగుతోంది. హిందూ వ్యతిరేకులను ప్రోత్సహించడమే సీఎం కేసీఆర్ తన విధిగా చేసుకున్నారు’ అని ఆయన ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ‘ప్రజల్లో వ్యతిరేకత వస్తున్నప్పటికీ సీఎం మౌనం వహించడం ఆయన పతనానికి నాంది కాబోతోంది. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తాము’ అని బండి సంజ‌య్ హెచ్చ‌రించారు.