 
                త్రివేండ్ర రావత్ రాజీనామాతో ఖాళీ అయిన ఉత్తరాఖండ్  ఉత్తరాఖండ్  ముఖ్యమంత్రి  పదవికి  పార్లమెంట్  సభ్యుడు తిరథ్ సింగ్ రావత్ ను బిజెపి ఎంపిక చేసింది.  ఆయన్ను సీఎంగా ఎన్నుకుంటూ పార్టీ వర్గాలు బుధవారం నిర్ణయం తీసుకున్నాయి. 
ఆయన ఇవాళ సాయంత్రం 4 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.  సీఎం పదవి నుంచి తప్పుకున్న త్రివేంద్ర సింగ్ రావత్ ఈ విషయాన్ని వెల్లడించారు.
56 ఏళ్ల తిరథ్ సింగ్ రావత్.. 2013-15 మధ్య ఉత్తరాఖండ్లో పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. గతంలో రాష్ట్ర ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. 
కేంద్ర మంత్రి రమేష్ ఫోఖ్రియాల్ నిషాంక్, ఉత్తరాఖండ్ రాష్ట్ర మంత్రి ధన్ సింగ్ రావత్ తదితరుల పేర్లను పరిశీలించిన అనంతరం సీఎం పదవిని తిరథ్కు ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. 
మంగళవారం డెహ్రాడూన్లో పార్టీ లెజిస్లేచర్ మీటింగ్లో పాల్గొన్న బీజేపీ నేతలు ఈ నిర్ణయం తీసుకున్నారు. పనితీరు సరిగా లేని కారణంగా రాష్ట్రంలో నాయకత్వాన్ని మార్చాలనే డిమాండ్లు రావడంతో మాజీ సీఎం త్రివేండ్ర సింగ్ రావత్ తన సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
                            
                        
	                    




More Stories
రోడ్లు సరిగా లేకుంటే పన్ను చెల్లించం..బెంగళూర్ ప్రజల అల్టిమేటం!
2027 జనాభా లెక్కలకు సిద్ధమైన కేంద్రం
భారతీయ సినిమాలంటే ఎంతో ఇష్టం.. పుతిన్