ప్రతీ ముగ్గురు మహిళల్లో ఒకరిపై లైంగికహింస  

ప్రపంచవ్యాప్తంగా ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు తమ జీవితకాలంలో ఏదో ఒక సమయంలో సన్నిహిత భాగస్వామి లేదా ఇతరుల నుంచి లైంగిక హింసకు గురయ్యారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తన తాజా నివేదికలో వెల్లడించింది. ప్రతీ దేశంలోనూ మహిళలపై లైంగిక హింస కొనసాగుతుందని ప్రపంచ ఆరోగ్యసంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా 736 మిలియన్ల మంది మహిళలు లైంగికహింసకు గురయ్యారని డబ్ల్యూహెచ్‌వో తాజా అధ్యయనంలో వెల్లడైంది.15 నుంచి 24 సంవత్సరాల వయసుగల వారు ఎక్కువగా లైంగికహింసకు గురవుతున్నారని తేలింది. కరోనాను వ్యాక్సిన్ తో ఆపగలుగుతున్నా మహిళలపై లైంగిక హింసాకాండను ఆపలేక పోతున్నాయని విచారం వ్యక్తం చేశారు.

ప్రభుత్వాలు మహిళలకు అవకాశాలు కల్పించడంతోపాటు వారికి గౌరవనీయమైన స్థానం కల్పించాలని డాక్టర్ టెడ్రోస్ అధనామ్ సూచించారు. మధ్య ఆదాయ దేశాల్లో మహిళలపై హింస ఎక్కువగా ఉంది. అంటే మీ పక్కన ఉన్నవారే – మీ కుటుంభం సభ్యులు కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు, మీతో కలసి పనిచేస్తున్న వారు కావచ్చు ,,,, ఏదో ఒక సందర్భంలో లైంగిక హింసను ఎదుర్కొన్నవారే. 

ప్రపంచంలోని అత్యంత పేద దేశాల్లో నివశిస్తున్న మహిళల్లో సుమారు 37 శాతం మంది తమ జీవిత కాలంలో సన్నిహిత భాగస్వామి నుంచి లైంగికహింసను ఎదుర్కొన్నారు.కొన్ని దేశాల్లో ఇద్దరు మహిళల్లో ఒకరు లైంగిక హింసను ఎదుర్కొన్నారు.ప్రపంచవ్యాప్తంగా మహిళలపై లైంగిక హింస ప్రబలంగా ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది

సంవత్సరాల తరబడి పురుష ఆధిపత్యం ధోరణులు గల సమాజమే మహిళలు నిరాటంకంగా ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులకు కారణమని చెప్పవచ్చు.