హౌరా రూరల్ ఎస్పీపై ఈసీ వేటు

పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హౌరా రూరల్ ఎస్పీ సౌమ్యారాయ్ పై కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) తొలగించింది.దక్షిణ 24 పరగణాస్ జిల్లా సోనాపూర్ దక్షిణ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎస్పీ రాయ్ భార్య, సినీనటి లవ్లీ మైత్రా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినిగా ఎన్నికల బరిలోకి దిగారు. 
 
ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల కుటుంబ సభ్యులు ఎన్నికల నిర్వహణలో ఉండరాదనే నిబంధన మేర తాము రూరల్ ఎస్పీ రాయ్ ను తొలగించామని ఈసీ కార్యాలయం పేర్కొంది. లవ్లీ మిత్రా ఎన్నికల్లో పోటీ చేస్తున్నందున తాము సౌమ్యారాయ్ ను తొలగించామని ఈసీ జారీ చేసిన వివరణలో వెల్లడించింది. లవ్లీ మైత్రా టీఎంసీ అభ్యర్థినిగా ప్రకటించగానే హౌరా రూరల్ ఎస్పీగా రాయ్ ఎలా కొనసాగుతారని పలువురు గతంలో ప్రశ్నించారు. 
పశ్చిమబెంగాల్‌లో టీఎంసీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన సువేందు అధికారి నామినేషన్ ప్రక్రియను అట్టహాసంగా జరిపేందుకు వ్యూహరచన చేస్తున్నారు. ఈనెల 12న నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి పోటీకి ఆయన నామినేషన్ వేయనున్నారు.  ఈ సందర్భంగా ఆయన వెంట పార్టీ రాష్ట్ర నేతలతో పాటు, కేంద్ర మంత్రులు ఒకరిద్దరు కూడా సువేందు వెంట  నామినేషన్‌ ప్రక్రియకు తరలి వెళ్తారు. కేంద్రం మంత్రి స్మృతి ఇరానీ ఈ నామినేషన్ ఘట్టానికి హాజరవుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థిగా నందిగ్రామ్ నుంచి భారీ మెజారిటీతో సువేందు అధికారి గెలిచారు. మారిన రాజకీయ పరిస్థితుల్లో ఆయన ఇటీవల టీఎంసీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిపోయారు. నందిగ్రామ్‌ నియోజకవర్గం ఇరు పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. మమతను 50,000 వేల ఆధిక్యంతో ఓడిస్తానంటూ సువేందు ప్రతినబూనారు.
 
 కాగా, ప‌శ్చిమ‌బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల కోసం 8 విడుత‌ల్లో పోలింగ్ నిర్వహించాల‌న్న కేంద్ర ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యాన్ని స‌వాల్ చేస్తూ దాఖ‌లైన పిటిష‌న్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. బెంగాల్లో ఎనిమిది విడుత‌ల పోలింగ్ విష‌య‌మై పిటిష‌నర్ వాద‌న‌తో తాము ఏకీభ‌వించ‌డంలేద‌ని, కేసును పూర్వాప‌రాలు ప‌రిశీలించి ఈ పిటిష‌న్‌ను కొట్టివేస్తున్నామ‌ని సుప్రీంకోర్టు ధ‌ర్మాసనం స్ప‌ష్టంచేసింది.